ETV Bharat / sports

ప్రతి 10 బంతులకో సిక్సర్​తో పాండ్య@4.. మరి టాప్​ ఎవరు?

author img

By

Published : Apr 9, 2022, 12:42 PM IST

Top 10 players with best balls/six ratio in ipl
Top 10 players with best balls/six ratio in ipl

IPL Balls per Six: ఐపీఎల్​లో హార్డ్​హిట్టర్లకు మంచి డిమాండ్​ ఉంటుంది. ఆడే తక్కువ బంతుల్లో.. వీలైనన్ని స్టాండ్స్​లోకి పంపిస్తే చాలు మ్యాచ్​ను మలుపుతిప్పొచ్చు. ఇలా తక్కువ బంతుల వ్యవధిలో ఎక్కువ సిక్సర్లు బాదిన వారిలో విండీస్​ హిట్టర్​, కోల్​కతా ఆటగాడు రసెల్​ టాప్​లో ఉన్నాడు. ఇతడు సగటున ఐపీఎల్​లో ఎదుర్కొన్న ప్రతి 7 బంతులకో సిక్సర్ బాదాడు. మరి టాప్​-10లో ఉన్న ఆటగాళ్లెవరో చూద్దాం.

IPL Balls per Six: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచుతోంది. ఇప్పటివరకు 16 మ్యాచ్​లు పూర్తయ్యాయి. మూడేసి విజయాలతో కోల్​కతా నైట్​రైడర్స్​, గుజరాత్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ పాయింట్ల పట్టికలో వరుసగా టాప్​లో ఉన్నాయి. సన్​రైజర్స్​ హైదరాబాద్​, ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్​ కింగ్స్​ పేలవ ప్రదర్శనతో కింది నుంచి వరుసగా ఉన్నాయి. అయితే.. ఐపీఎల్​ అంటే హార్డ్​హిట్టర్ల గురించి ముందుగా చెప్పుకోవాలి. సిక్సర్లతో మ్యాచ్​లను మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది గుజరాత్​కు అనూహ్య విజయాన్ని అందించాడు రాహుల్​ తెవాతియా.

ఆఖర్లో వచ్చి సిక్స్​లతో టీమ్​కు భారీ స్కోరు అందించిన వారి గురించి చెప్పుకోవాల్సి వస్తే.. మంచి ఫినిషర్​గా పేరొందిన మహేంద్ర సింగ్​ ధోనీ, హార్దిక్​ పాండ్య, రసెల్​, పొలార్డ్​, డివిలియర్స్​ ముందువరుసలో ఉంటారు. అయితే.. తక్కువ బంతులు వ్యవధిలో, సిక్సర్లు ఎక్కువగా బాదిన వారిలో విండీస్​ హార్డ్​హిట్టర్​, కోల్​కతా నైట్​రైడర్స్​ విధ్వంసకర బ్యాటర్​ ఆండ్రీ రసెల్​ టాప్​లో ఉన్నాడు. ఇతడు సగటున ప్రతి 7 బంతులకో సిక్సర్​ బాదాడు. స్ట్రైక్​ రేట్​ 180 కావడం విశేషం. ఐపీఎల్​లో 73 ఇన్నింగ్స్​లాడి 1806 రన్స్​ చేశాడు. ఐపీఎల్​లో కనీసం 500 బంతులు ఎదుర్కొన్న వారిలో ఇలా తక్కువ బంతుల వ్యవధిలో సిక్సర్లు బాదిన వారిలో టాప్​-10లో భారత బ్యాటర్​ ఒక హార్దిక్​ పాండ్య మాత్రమే. పాండ్య.. సగటున ప్రతి 10 బంతులకు ఒకదాన్ని స్టాండ్స్​లోకి పంపించాడు. ఇతడు మొత్తం 87 ఇన్నింగ్స్​ల్లో 1540 పరుగులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. స్టైక్​ రేట్​ 150కి పైనే. ప్రతి 9 బంతులకో సిక్స్​తో గేల్​ 2, 10 బంతులకో సిక్స్​తో పొలార్డ్​ మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను ఓసారి పరిశీలిస్తే..

Top 10 players with best balls/six ratio in ipl, only indian hardik pandya
టాప్​లో రసెల్​.. పాండ్య@4
russel
ఆండ్రీ రసెల్​
hardik pandya
హార్దిక్​ పాండ్య
GAYLE
క్రిస్​ గేల్​

ఇవీ చూడండి: సక్సెస్​ మంత్రం చెప్పిన గిల్​.. తెవాతియాపై ప్రశంసలు!

అప్పుడు ధోని.. ఇప్పుడు తెవాతియా.. 2 బంతుల్లో రెండు సిక్సర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.