ETV Bharat / sports

అప్పుడు ధోనీ.. ఇప్పుడు తెవాతియా.. 2 బంతుల్లో రెండు సిక్సర్లు

author img

By

Published : Apr 9, 2022, 9:30 AM IST

Updated : Apr 9, 2022, 1:20 PM IST

last ball six in IPL: పంజాబ్​ కింగ్స్​తో శుక్రవారం జరిగిన మ్యాచ్​లో గుజరాత్​ ఆల్​రౌండర్​ రాహుల్​ తెవాతియా చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే, ఐపీఎల్​లో ఇలాంటి అద్భుతాలు జరగడం తొలిసారేం కాదు. గతంలో ఈ ఫీట్​ను మహేంద్ర సింగ్​ ధోనీ కూడా సాధించాడు. అలాగే.. చివరి బంతికి సిక్సర్​ అవసరమవగా దాన్ని ఛేదించిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆ సందర్భాలను నెమరువేసుకుందాం..

IPL Last ball six
ధోని, తెవాతియా

last ball six in IPL: వన్డేలైనా, టీ20లైనా ఆఖరి బంతికి సిక్సర్ కొట్టటం అంటే అంత సులభమైన విషయం కాదు. అందులోనూ జట్టు విజయ సమీకరణ చివరి బంతికి ఆరు పరుగులుగా ఉన్నప్పుడు క్లిష్టమనే చెప్పాలి. అదే విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి వస్తే.. అది ఇంకా కష్ట సాధ్యం. ఛేజింగ్ సమయాల్లో ఇలాంటివి చాలా అరుదుగా సంభవిస్తాయి. అయితే ఐపీఎల్​లో మాత్రం ఇలాంటి అద్భుత ఛేజ్​లు రెండు సార్లు చోటు చేసుకున్నాయి. గతంలో మహేంద్ర సింగ్ ధోని ఈ ఫీట్​ను సాధిస్తే.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ రాహుల్ తెవాతియా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. అయితే.. ఈ రెండు సందర్భాల్లో ప్రత్యర్థి పంజాబ్​ జట్టే కావటం గమనార్హం.

ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో తెవాతియా హీరోగా నిలిచాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్​కు ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా.. ఒడెన్ స్మిత్ బౌలింగ్​లో తెవాతియా వరుసగా రెండు సిక్సర్లు బాది తన జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

2016 ఐపీఎల్ సీజన్ లో భాగంగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో మహేంద్ర సింగ్​ ధోనీ అద్భుత చేశాడు. చివరి ఓవర్​లో పుణేకు 23 పరుగులు అవసరంగా కాగా.. అక్షర్ పటేల్ బౌలింగ్​ చేశాడు. అప్పటికి అక్షర్ పటేల్ మూడు ఓవర్లు వేసి 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో అప్పటి పంజాబ్ సారథి మురళీ విజయ్ అక్షర్ పటేల్ చేతిలో బంతి పెట్టాడు. తొలి నాలుగు బంతుల్లో ధోని ఒక సిక్సర్, ఒక ఫోర్ సాయంతో 10 పరుగులు రాబట్టగా.. ఓ వైడ్ పడింది. తొలి నాలుగు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఇక చివరి రెండు బంతులకు 12 పరుగులు చేయాల్సి ఉండగా.. ధోని అద్భుతం చేసి చూపించాడు. రెండు బంతులకు రెండు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.

చివరి బంతికి సిక్సర్​తో విజయాన్నందించిన సందర్భాలు: డ్వేన్​ బ్రావో: చివరి బంతికి ఆరు పరుగులు అవసరమవగా.. సిక్సర్​ కొట్టి తమ జట్టును విజయానికి చేర్చిన సందర్భాలూ ఉన్నాయి. 2012లో చెన్నై సూపర్​ కింగ్స్​ ఆటగాడు డ్వేన్​ బ్రావో చివరి బంతికి సిక్సర్​ బాది విజయాన్ని అందించాడు. కోల్​కతా నైట్​ రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో చివరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. రజత్​ భాటియా బౌలింగ్​కు వచ్చాడు. తొలి ఐదు బంతుల్లో కేవలం నాలుగు పరుగులే వచ్చాయి. దాంతో చెన్నై ఓటమి కాయమనుకున్నారంతా. అయితే.. చివరి బంతిని స్టాండ్స్​లోకి పంపి విజయాన్నందించాడు బ్రావో.

కేఎస్​ భరత్​: దుబాయిలో జరిగిన ఐపీఎల్​ 2021లో దిల్లీ డేర్​డెవిల్స్​, ఆర్​సీబీ మధ్య జరిగిన మ్యాచ్​లో చివరి బంతిని సిక్సర్​గా మలిచి బెంగళూరుకు విజయాన్ని అందించాడు కేఎస్​ భరత్. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం ఉండగా అవేశ్​ ఖాన్​ బౌలింగ్​కు వచ్చాడు. తొలి మూడు బంతుల్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఓ వైడ్​ వేశాడు అవేశ్​. ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టిన భరత్​ చివరి బాల్​ను సిక్సర్​గా మలిచాడు.

ఇదీ చూడండి: సక్సెస్​ మంత్రం చెప్పిన గిల్​.. తెవాతియాపై ప్రశంసలు!

Last Updated : Apr 9, 2022, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.