ETV Bharat / sports

ఓహో.. ఇదా సూర్యకుమార్​ సూపర్ షాట్స్​ టెక్నిక్​

author img

By

Published : Oct 26, 2022, 7:53 PM IST

Updated : Oct 26, 2022, 8:59 PM IST

టీమ్​ఇండియా విధ్వంసకర బ్యాటర్​ సూర్యకుమార్ యాదవ్​.. జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం, ఈ స్థాయికి ఎదగడం వెనక ఉన్న కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. టీమ్​లోకి అడుగుపెట్టడానికి తాను అనుసరించిన వ్యూహాన్ని వివరించాడు. తన సూపర్​ షాట్ల వెనుక ఉన్న రహస్యాన్ని కూడా చెప్పాడు. ఆ సంగతులు..

surya kumar yadav
సూర్యకుమార్​ యాదవ్​ షాట్స్ టెక్నిక్స్​

టీమ్​ఇండియా యువ సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ దూసుకుపోతున్నాడు. మైదానంలో తనదైన శైలిలో అదిరిపోయే షాట్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫ్యాన్స్​ షాక్​ అయ్యే ప్రదర్శన చేస్తున్నాడు. అయితే అతడు జాతీయ జట్టులోకి అడుగుపెట్టడం, ఈ స్థాయికి ఎదగడం వెనక ఎంతో కష్టం దాగి ఉంది. దాదాపు ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌ మొదలుపెట్టిన 11 ఏళ్లకు అతడికి జాతీయ జట్టులో స్థానం లభించింది. తాజాగా ఈ విషయాన్నే అతడు గుర్తుచేసుకున్నాడు. ఎంత కష్టించినా నేషనల్​ టీమ్​కు ఎంపిక కాకపోవడంపై ఒక దశలో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపాడు. టీమ్​లోకి అడుగుపెట్టడానికి తాను అనుసరించిన వ్యూహాన్ని వివరించాడు. తన సూపర్​ షాట్ల వెనుక ఉన్న రహస్యాన్ని కూడా చెప్పాడు.

తీవ్ర నిరాశకు.. మొదట్లో ఎంతో శ్రమించినా టీమ్​ఇండియాకు సెలెక్ట్ కాకపోవడంపై మాట్లాడుతూ.. "2017-18లో నేను, నా భార్య దేవిషా కలిసి ఓ నిర్ణయం తీసుకొన్నాం. ఇక నుంచి హార్డ్​ వర్క్​ మానేసి.. స్మార్ట్‌ వర్క్‌ చేయాలని నిర్ణయించుకున్నాం.కొంచెం భిన్నంగా ప్రయత్నించాలని ఫిక్స్ అయ్యాం. ఫలితం ఏం వస్తుందో చూద్దామని అనుకున్నాం. దీంతో నా ట్రైనింగ్​ను డిఫరెంట్​గా ప్రారంభించాను. 2018 తర్వాత నేను ఏం చేయాలో తెలిసొచ్చింది. ఆఫ్‌సైడ్‌ ఎక్కువగా దృష్టిపెట్టాను. దీంతో పాటు డైటింగ్‌ మొదలుపెట్టాను. నేను చేసిన చిన్నచిన్న పనులే.. 2018, 19 దేశవాళీ సీజన్‌లో బాగా ఉపయోగపడ్డాయి. 2020 నాటికి నా శరీరం పూర్తిగా మారిపోయింది"

"నా శరీరం దేనికి అలవాటుపడింది? నాకు ఏది సహాయపడుతుంది? ఎలా ముందుకు వెళ్లాలి? అనేది అర్థం చేసుకోవడానికి ఏడాదిన్నర పట్టింది. క్రమంగా వాటన్నింటినీ గ్రహించి సరైన దిశలో ప్రయాణం మొదలుపెట్టాను. నాటి నుంచి ప్రతీది వాటంతట అవే జరిగిపోయాయి. నేనేం చేయాలి? నా సాధన ఎంతమేరకు ఉండాలి? అనే విషయాలు అర్థమయ్యాయి. గతంలో నేను మొద్దుగా సాధన చేసేవాడిని. కొన్ని సార్లు అసహనానికి గురయ్యేవాడిని. ఆ ప్రాక్టీస్‌లో నాణ్యత లేదని తెలుసుకున్నా. 2018 తర్వాత నాణ్యమైన శిక్షణ, డైట్‌, నెట్‌సెషన్స్‌ లభించాయి. ఇవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. పూర్తిగా సిద్ధమయ్యాక లీగ్‌ సహా ఫార్మాట్లలో బాగా పరుగులు చేశా. దీంతోపాటు ఆటలో నిలకడ వచ్చింది." అని వివరించాడు.

చాలా నిరాశపడ్డా.. 2020లో ఆస్ట్రేలియాకు వెళ్లే జాతీయ జట్టుకు సూర్యకుమార్​ యాదవ్​ సెలెక్ట్ అవ్వలేదు. దీని గురించి మాట్లాడుతూ.. అది తనలో మరింత పట్టుదల పెంచిందని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సంఘటన తర్వాత కొన్ని రోజులకే లీగ్‌లో ముంబయి తరఫున 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తాచాటాడు. ఆ సమయంలో చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చాడు. "లీగ్‌లో చాలా దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉండేవారు. వారంతా నన్ను బాగా ఆడుతున్నావ్​ అని అభినందించేవారు. నీకు అవకాశం వస్తుంది అని చెప్పేవారు. నేను కూడా ఉత్సాహంగా ఉండేవాడిని. జాతీయ జట్టులో స్థానంపై ఊహించుకొనేవాడిని. కానీ, స్థానం దక్కకపోవడంతో నిరాశపడ్డా" అని వెల్లడించాడు.

ప్లాన్​ ఏమీ ఉండదు.. సూర్యకు.. ఎదుర్కొన్న తొలి బంతిని తరచూ బౌండరీలకు తరలించే ఆటగాడిగా మంచి పేరుంది. దీనిగురించి మాట్లాడుతూ.. మ్యాచ్‌ల్లో తాను ప్లాన్‌ చేసుకొని తొలి బంతిని బౌండరీ కొట్టనని వెల్లడించాడు. తాను మైదానంలోకి దిగే సమయానికే వార్మప్‌ చేసి ఉత్సాహంగా ఉంటానని తెలిపాడు. "గ్రౌండ్‌లో అడుగుపెట్టగానే నాదైన ముద్ర వేస్తాను. స్కోర్‌ చేయడానికే మైదానంలోకి వచ్చానని ప్రత్యర్థికి స్పష్టమైన సంకేతాలు పంపిస్తాను. ఈ క్రమంలోనే తొలి బంతిని ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టడమో.. లేకపోతే తొలి ఏడెనిమిది బంతుల్లో రెండు మూడు ఫోర్లు బాదడమో నా శైలి" అని వివరించాడు.

అది బాగా ఉపయోగపడుతోంది.. చిన్నప్పుడు రబ్బర్‌ బంతితో క్రికెట్​ ఆడటం వల్ల భిన్నమైన షాట్లు ఆడగలుగుతున్నట్లు సూర్యకుమార్‌ పేర్కొన్నాడు. పాఠశాలలో చదివే సమయంలో సిమెంట్‌ ట్రాక్‌లపై రబ్బరు బంతితో ఆడేవాడని గుర్తుచేసుకున్నాడు. దీంతో బంతిని స్కూప్‌, పుల్‌, అప్పర్‌కట్‌, వోవర్‌ది పాయింట్‌ వైపు స్లైస్‌ వంటివి ఆడటం వచ్చాయన్నాడు. వీటిని తానెప్పుడూ నెట్స్‌లో గానీ, బౌలింగ్‌ యంత్రంపై గానీ సాధన చేయలేదన్నాడు.

ఇదీ చూడండి: ర్యాంకింగ్స్​లో దూసుకెళ్లిన కోహ్లీ.. కానీ ఈ సారి సూర్య మాత్రం..

Last Updated : Oct 26, 2022, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.