ETV Bharat / sports

'పాక్​లో నాలుగు దేశాలతో వన్డే టోర్నీ.. గంగూలీతో చర్చిస్తా'

author img

By

Published : Mar 15, 2022, 6:40 PM IST

Updated : Mar 16, 2022, 1:05 PM IST

Ramiz Raja
రమీజ్​ రాజా

Ramiz Raja On Ganguly: భారత్ సహా నాలుగు దేశాలతో వన్డే టోర్నమెంట్​ నిర్వహించాలని ప్రతిపాదించాడు పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్​ రాజా. ఈ విషయంపై దుబాయ్​లో జరిగే ఏసీసీ సమావేశంలో సౌరభ్​ గంగూలీతో మాట్లాడుతానని తెలిపాడు.

Ramiz Raja On Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీతో మాట్లాడుతానన్నాడు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్ రమీజ్​ రాజా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, పాకిస్థాన్​, భారత్​తో వన్డే టోర్నమెంట్​ నిర్వహించాలని ప్రతిపాదించాడు. మార్చి 19న దుబాయ్​లో జరిగే ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తానన్నాడు. ఇండియాతో పాకిస్థాన్​ ఆడితే ఆదాయం మరింత పెరుగుతుందని చెప్పాడు. కరాచీలోని జాతీయ స్టేడియంలో మీడియాతో మాట్లాడిన రాజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

"దుబాయ్​లో జరిగే ఏసీసీ సమావేశంలో సౌరభ్​ గంగూలీతో నేను మాట్లాడతాను. మేమిద్దరం మాజీ నాయకులం, ఆటగాళ్లము. మా ఇద్దరికి క్రికెట్​ అనేది రాజకీయం కాదు. ఒకవేళ ఇండియా మా ప్రతిపాదనతో అంగీకరించకపోతే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​తో పాకిస్థాన్​లో మూడు దేశాల టోర్నీ​ నిర్వహిస్తాం. పాక్​కు వస్తారని భావిస్తున్నాం. రాకపోతే ఏం చేయాలో అప్పుడు చూద్దాం."

-రమీజ్​ రాజా, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​

పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ రమీజ్​ రజా చేసిన ప్రతిపాదనను బీసీసీఐ కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. క్రికెట్​కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కల్పించడానికి భారత్​ కృషి చేస్తోందని.. స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం కాదన్నాడు.

ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్​కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్​ల తేదీలను దుబాయ్​లో జరిగే సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్​కు ముందే ఆసియా కప్​ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ముంబయి టీమ్​లో సగం మంది వాళ్లే.. మ్యాజిక్ రిపీట్​ చేస్తారా?

Last Updated :Mar 16, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.