ETV Bharat / sports

వర్షంలోనే పృథ్వీ షా బ్యాటింగ్ ప్రాక్టీస్.. టార్గెట్ వాళ్లేనా!

author img

By

Published : Jul 27, 2023, 9:56 PM IST

టీమ్ఇండియా యువ బ్యాటర్ పృథ్వీ షా.. సెలెక్టర్ల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు తాజాగా చేసిన ఓ పని ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. మరి అతడు ఏం చేశాడంటే!
prithvi shaw batting in rain
వర్షంలో పృథ్వీ షా బ్యాటింగ్

టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ పృథ్వీ షా.. మరోసారి వార్తల్లోకెక్కాడు. విండీస్​తో టీ20 సిరీస్​లో తనను ఎంపిక చేయనందున.. షా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలె జోరు వర్షాలు ముంబయిని కుదిపేస్తున్న క్రమంలో.. షా ఆ వానలోనే తడూస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇది వీడియో తీసి స్వయంగా పృథ్వీయే తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. విండీస్ టూర్​కు తనను ఎంపిక చేయనందుకు సెలక్టర్ల పట్ల షా.. పరోక్షంగా నిరసన తెలిపాడు అని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

23 ఏళ్ల పృథ్వీ.. ఇప్పటివరకు ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో ఆడిన షా కు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత మళ్లీ షా కు జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో కివీస్​తో టీ20 లకు సెలెక్ట్ అయ్యాడు. కానీ అప్పుడు బెంచ్​కే పరిమితమయ్యడు. కాగా తాజా విండీస్ పర్యటనతో పాటు, ఆసియా క్రీడలకు సైతం పృథ్వీకి పిలుపు అందలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన షా.. ఈ విధంగా వినూత్నంగా నిరసన తెలిపినట్లున్నాడు.

ఇక తనను జాతీయ జట్టులో నుంచి ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదంటూ.. పృథ్వీ ఇదివరకే వాపోయాడు. ఫిట్​నెస్ లోపం కారణంగా తనను ఎంపిక చేయట్లేదని తెలుసుకున్న పృథ్వీ.. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ) కు వెళ్లి అక్కడ అన్ని టెస్ట్​లను క్లియర్ చేసినట్టు ఇదివరకే తెలిపాడు.

కాగా పృథ్వీ ఇటీవలె ఐపీఎల్​లో ఘోరంగా విఫలమయ్యాడు. దిల్లీ క్యాపిటల్స్ తరఫున 8 మ్యాచ్​లు ఆడిన పృథ్వీ.. కేవలం 106 పరుగులే చేశాడు. అతడి వైఫల్యాల కారణంగా ఐపీఎల్​లో కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక దులీప్ ట్రోఫీలోను పృథ్వీ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. వెస్ట్ జోన్​కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ.. ఫైనల్​లో 65 పరుగులు చేసినప్పటికీ, ఈ మ్యాచ్​లో ప్రత్యర్థి సౌత్​జోన్ 75 పరుగులతో నెగ్గింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.