ETV Bharat / state

బడా రెస్టారెంట్​లో ఫుడ్ భలే టేస్టీగా ఉంటుందని వెళ్తున్నారా? - ఐతే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే - Food Adulteration in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 10:38 AM IST

Food Adulteration in Hyderabad : అలా బయటకు వెళ్లి ఏదైనా తినాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! ఎందుకంటే కంటికి ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలన్నీ మేలైనవి కావు. సాధారణ హోటళ్లలోనే ఇలాంటి పరిస్థితి అనుకుంటే పొరపడినట్లే. ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. తిండి దగ్గర నుంచి వడ్డించే గిన్నెల వరకూ అపరిశుభ్రమేనని టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో వెల్లడైంది.

Food Adulteration in Hyderabad
Food Adulteration in Hyderabad (ETV Bharat)

Food Adulteration in Restaurants Hyderabad : ఏ సీజన్​లో అయినా డల్ అవ్వని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కానీ హోటళ్ల పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి, బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. అలాగని సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఏర్పడింది. తాజాగా అధికారులు హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Food Safety Officers Raids on Hotels in Hyderabad : హైదరాబాద్‌లో ఆహారకల్తీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అలాగని సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఏర్పడింది. కొంత కాలంగా జీహెచ్‌ఎంసీ, రాష్ట్ర స్థాయి ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు చేపడుతోన్న సోదాలతో బడా హోటళ్లలోని డొల్లతనం వెలుగులోకొస్తోంది.

బుధవారం నాడు జరిపిన సోదాల్లో సోమాజిగూడలోని క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్‌ ఓ బార్, కేఎఫ్‌సీలలో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులేని సంస్థల పేరుతో తయారైన ఆహార పదార్థాలు, టీడీఎస్‌ తగిన మోతాదులోలేని తాగునీటి సీసాలు, దుర్గంధంతో కూడిన కిచెన్లు, తదితర సమస్యలను అధికారులు గుర్తించారు. ఇటీవల తనిఖీల్లో వడ్డించే గిన్నెలను సవ్యంగా శుభ్రం చేయని హోటళ్లు, రెస్టారెంట్లను గుర్తించామని అధికారులు తెలిపారు.

Food Adulteration in Hyderabad
పలు హోటళ్లలోని వంట గదుల్లో అపరిశుభ్రంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలు (ETV Bharat)

ఈ '5' ఆహార పదార్థాలను మళ్లీ మళ్లీ వేడిచేసి తింటున్నారా? - అయితే మీరు ప్రమాదానికి వెల్​కమ్​ చెప్పినట్లే!

అక్కడికక్కడే చర్యలు :

  • క్రుతుంగ రెస్టారెంట్‌లో, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు లేని రూ.2,100 విలువైన ఆరు కేజీల గంగా గోల్డ్‌ పనీర్‌ ప్యాకెట్లు, టీడీఏఎస్‌ 4పీపీఎంగా ఉన్న రూ.7,800ల విలువైన 156 క్రుతుంగ బ్రాండ్‌ తాగునీటి సీసాలు, ఏప్రిల్‌ 3, 2024 నాటికి గడువు ముగిసిన రూ.1,800ల విలువైన ఆరు కేజీల మేతి మలాయ్‌ మిశ్రమం, నాసిరకం మాసాలాలు, రిఫ్రిజిరేటర్‌లో ప్యాకింగ్‌ లేకుండా నిల్వ చేసిన వేర్వేరు మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే చెత్త డబ్బాలో వేశామని, నోటీసు ఇచ్చి, నమూనాలను పరీక్షలకు పంపామని అధికారులు పేర్కొన్నారు.
  • రెస్ట్‌ ఓ బార్‌లో ఐదు ప్యాకెట్ల గార్లిక్‌ బ్రెడ్, ప్యాకింగ్‌ సరిగా లేని 50 పిజ్జాలు, ఐదు కేజీల న్యూడిల్స్‌ శీతల యంత్రంలో అడ్డదిడ్డంగా నిల్వ ఉంచారని, మాంసహారం, శాఖాహార పదార్థాలను ఒకే శీతల యంత్రంలో కలిపి నిల్వ చేయడం వంటి లోపాలను గుర్తించి, నాసిరకం ఆహారాలను ధ్వంసం చేసినట్లు యంత్రాంగం పేర్కొంది.
  • కేఎఫ్‌సీలో అసలైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు లేకుండా ఆహారకేంద్రాన్ని నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వంటగదుల్లో, వడ్డించేవాళ్లు, వంట మనుషుల శుభ్రతకు ఆ యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. సిబ్బంది వైద్య పరీక్షల సర్టిఫికెట్లు, వంట గదిలో బొద్దింకలు, ఇతర కీటకాలను నియంత్రించే వ్యవస్థ లేదని వారు వివరించారు.

ఆహార కల్తీలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ - బయట తింటే ఖతమే - నమ్మలేని నిజాలివే!

ఆఫర్లు చూసి టెంప్ట్.. పార్శిల్ ఓపెన్ చేస్తే కంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.