ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​కు ముందు పాక్​ క్రికెటర్​ సస్పెండ్​

author img

By

Published : Oct 14, 2021, 4:12 PM IST

PCB suspends Zeeshan Malik under Anti-Corruption Code
టీ20 ప్రపంచకప్​కు ముందు పాక్​ క్రికెటర్​ సస్పెండ్​

టీ20 ప్రపంచకప్​కు ముందు ఓ పాకిస్థాన్​ క్రికెటర్​ సస్పెండ్​కు గురయ్యాడు. అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో అతడిపై విచారణకు పీసీబీ ఆదేశించింది. పీసీబీ అవినీతి నిరోధక విభాగం విచారణ పూర్తయ్యే వరకు సదరు ఆటగాడు ఎలాంటి క్రీడాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలులేదు.

అవినీతి ఆరోపణల నేపథ్యంలో జీషన్​ మాలిక్​ అనే క్రికెటర్​ను పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ) సస్పెండ్​ చేసింది. పీసీబీకి చెందిన అవినీతి నిరోధక విభాగం ఈ విషయంపై విచారణ జరిపేంత వరకు సదరు క్రికెటర్​ ఎలాంటి క్రీడాకార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆదేశించింది. అయితే ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోన్న నేపథ్యంలో ఇతర వివరాలను పీసీబీ వెల్లడించలేదు.

పీసీబీ నిబంధనల్లోని ఆర్టికల్​ 4.7.1(a) ప్రకారం క్రికెటర్​ అవినీతికి పాల్పడితే సదరు ఆటగాడిపై చర్యలు తీసుకునే హక్కు పీసీబీకి ఉంటుంది. లేదా రూల్​ 4.7.1(b) ప్రకారం క్రికెటర్​పై ఉన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ సమగ్ర దర్యాప్తు చేసేంత వరకు సదరు క్రికెటర్​ను సస్పెండ్​ చేస్తుంది. అదే విషయాన్ని క్రికెట్​ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ మండలికి తెలియజేస్తుంది.

ఇదీ చూడండి.. ఐపీఎల్​ నియమావళిని ఉల్లంఘించిన దినేశ్​ కార్తిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.