ETV Bharat / sports

భారత్​పై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అక్కసు!

author img

By

Published : Oct 7, 2021, 4:51 PM IST

Pakistan T20 WC jerseys sport UAE 2021 instead of India 2021, pic goes VIRAL
భారత్​పై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు అక్కసు!

పాకిస్థాన్​ క్రికెట్​ టీమ్​పై(PCB News) క్రికెట్​ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్​నకు(ICC T20 World Cup 2021) సంబంధించిన జెర్సీపై.. టోర్నీ నిర్వహిస్తున్న భారత్​ పేరుకు బదులు.. యూఈఏ అని పేరు మార్చడం వల్ల పీసీబీ వక్రబుద్ధిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021)​ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీని యూఏఈ, ఒమన్​ దేశాల్లో భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI News) నిర్వహించనుంది. మరో వారం రోజుల్లో ఈ మెగాటోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్​(England Cricket News) ఇప్పటికే ఒమన్​ చేరుకోగా.. మిగిలిన దేశాల క్రికెట్​ జట్లు యూఏఈ పయనానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జట్లన్నీ తమ కిట్లతో పాటు కొత్త జెర్సీలను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు(Pakistan Cricket Board) చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ 2021ను భారతదేశంలో నిర్వహించాల్సింది. కానీ, భారత్​లో కొవిడ్​ సంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, ఒమన్​ వేదికల్లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పాల్గొనే జట్లు అన్నీ 'ఐసీసీ టీ20 ప్రపంచకప్​ ఇండియా 2021' అనే లోగో ఉన్న జెర్సీలను ధరించాల్సి ఉంది. పీసీబీ మాత్రం అందుకు భిన్నంగా టోర్నీని యూఏఈ పేరుతో(ఐసీసీ టీ20 ప్రపంచకప్​ యూఏఈ 2021) ఉన్న జెర్సీలతో(PCB Jersey) ఫొటో షూట్​ చేసింది. ఈ ఫొటో షూట్​కు సంబంధించిన అధికార ప్రకటన ఇంకా రాలేదు. కానీ, దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్​గా మారడం వల్ల పీసీబీపై పలువురు క్రికెట్​ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నెదర్లాండ్స్​ జట్టు జెర్సీపై మాత్రం ఇండియా నిర్వహిస్తున్నట్లు ఉంది. దీంతో పీసీబీపై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు.

ఇదీ చూడండి.. వచ్చే సీజన్​లో ఆడొచ్చు.. ఆడకపోవచ్చు: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.