ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పూర్తి కాని ధాన్యం కొనుగోళ్లు - రైతన్నలకు తప్పనితిప్పలు - Paddy Procurement in Telangana 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 2:08 PM IST

Yasangi Grain Purchase Delay in Telangana 2024 : సీజన్‌ ముగుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. ఈ కాలయాపనతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటి వరకు మండిన ఎండలతో ఇబ్బంది పడిన అన్నదాతలు, అనుకోకుండా కురుస్తున్న వర్షాలతో తడిసిన ధాన్యంతో ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో ఇప్పటికైనా త్వరగా పూర్తిచేయాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Paddy Procurement Problems in Joint Nizamabad District
Paddy Procurement Problems in Joint Nizamabad District (ETV Bharat)

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాక అన్నదాతల అవస్థలు (ETV Bharat)

Paddy Procurement Problems in Joint Nizamabad District : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. కానీ అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో 433 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 62,449 మంది రైతుల నుంచి 4.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నారు.

ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా, వాతావరణ మార్పుల కారణంగా ఆలస్యమైంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జల్లులు కురుస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు. ఆర్మూర్‌ డివిజన్‌లోని పలు మండలాల్లో ఇంకా సేకరణ మిగిలిపోయింది. దీంతో వర్షాల కారణంగా రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

"గత ఇరవైరోజుల నుంచి నుంచి ధాన్యం కొనడం లేదు. వర్షాలకు పడుతున్నాయి ధాన్యం తడిసిపోతోంది. మళ్లీ తిరిగి ఆరబెట్టాల్సి వస్తోంది. దీనికి తోడూ అధికారులు స్పందించడం లేదు. తేమ శాతం సరిగ్గా లేదని ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదు. ఇప్పటికే కొనుగోళ్లు చివరి దశకు చేరాయి. ఇప్పటికైనా త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం." - రైతులు

కామారెడ్డి జిల్లాలోనూ ధాన్యం పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఓవైపు కొన్ని మండలాల్లో సేకరణ ఆలస్యం కావడం, మరోవైపు వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కెతున్నారు. నిజాంసాగర్‌ మండలం కొమలంచ గ్రామంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఐదు రోజులుగా వడ్ల తూకం వేయడం లేదని, సరిపడా లారీలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రెవెన్యూ అధికారులకు జుక్కల్ మండలం ఖండేబల్లూర్ కర్షకులు వినతి పత్రం ఇచ్చారు. సత్వరమే కొనుగోలు చేయకపోతే రోడ్డెక్కి ధర్నా చేస్తామని హెచ్చరించారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం - రోడ్డెక్కి లబోదిబోమంటున్న రైతాంగం - PROTEST FOR WET PADDY PROCUREMENT

కామారెడ్డి జిల్లాలో జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లు పలుచోట్ల మిగిలిపోయాయి. బిచ్కుంద మండలంలో లారీలు రాక, ధాన్యం బస్తాలు కదలక ఇబ్బంది పడుతున్నారు. జుక్కల్ మండలంలో లారీలు రావట్లేదని, వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బస్తాకు 4 రూపాయల హమాలీలు వసూలు చేస్తున్నారని, తరుగు తీస్తున్నారని అన్నదాతలు అంటున్నారు. పిట్ల మండలంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూడాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నత్తతో పోటీ పడుతోన్న ధాన్యం కొనుగోళ్లు - కాపలా కాయలేక అవస్థలు పడుతున్న అన్నదాతలు - Paddy Procurement Slows Down

వడగళ్ల వానతో తడిసి ముద్దయిన ధాన్యం - చేతికందిన పంట పోయిందని రైతుల ఆవేదన - Paddy Crop Damage In Warangal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.