ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిన ధాన్యం - రోడ్డెక్కి లబోదిబోమంటున్న రైతాంగం - PROTEST FOR WET PADDY PROCUREMENT

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 2:40 PM IST

TS Farmers Protest Over Wet Paddy Procurement : రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. పంట చేతికొచ్చే ముందు వరుణుడి ఉగ్రరూపానికి బలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైందని ఆవేదన చెందుతున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు.

Farmers Protest Over Paddy Procurement
Farmers Protest Over Paddy Procurement

Farmers Protest Over Paddy Procurement : రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు కొన్ని జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తాజాగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​ మండలం కొమలంచ గ్రామంలో రైతులు రోడ్జెక్కారు.

గత ఐదు రోజుల నుంచి గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని కామారెడ్డి రైతులు నిరసనకు దిగారు. 40 లారీలకు పైగా ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను ఎఫ్​సీఐ కేంద్రాలకు తరలించి 25 రోజులు గడిచినా ఇంకా తూకం జరగడం లేదని వాపోయారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేదంటూ రోడ్డుపై భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

"గత పదిరోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయాయి. సొసైటీ వాళ్లను అడిగితే రైస్​మిల్లు ఓనర్లు వద్దు అంటున్నారు మేమేం చేయాలని అంటున్నారు. గత పదేళ్లుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. గత ఐదు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోయింది. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఐదు నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలి." - రైతులు

Nirmal Crop Loss : అలాగే నిర్మల్​ జిల్లా మామడ, లక్ష్మణ చందా మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయిపోయింది. చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలొచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం గూడూరులో ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నత్త నడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలు, తేమ పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఆవేదన చెందారు.

20 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయటం లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ రహదారి 163పై బైఠాయించారు. రైతుల ధర్నాతో హైదరాబాద్​-వరంగల్​ వెళ్లే వాహనాలు రోడ్లపై నిలిచిపోయి ట్రాఫిక్​ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. అధికారులకు చెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

హనుమకొండలో వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Hanamkonda

ఈదురు గాలుల బీభత్సం - పలు జిల్లాల్లో నేలకొరిగిన ఉద్యాన పంటలు - Untimely Rains in Telangana 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.