ETV Bharat / state

హనుమకొండలో వాన బీభత్సం - తడిసి ముద్దయిన ధాన్యం - Crop Damage in Hanamkonda

author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 12:08 PM IST

Crop Damage due To Heavy Rain in Parkal : అకాల వర్షాల కారణంగా హనుమకొండ జిల్లా పరకాలలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులతో పంట నేల వాలింది. చేతికొచ్చిన పంట నష్టపోయామంటూ వాపోయారు. ఆరుగాలం శ్రమించి పంట వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Crop Damage due To Heavy Rain in Parkal
Crop Damage due To Heavy Rain in Hanamkonda (ETV Bharat)

Crop Damage due To Heavy Rain in Hanamkonda : అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్ట పరుస్తున్నాయి. బయట నుంచి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే వర్షాలు పడి అప్పులో ఊబిలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తడిచిన వడ్లను కొనాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్‌ వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో కల్లాల్లోనే వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల పంట నేల వాలింది. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. ఆరుగాలం శ్రమించిన పంట వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకాల వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యం - చేతికందిన పంట పోయిందని రైతుల ఆవేదన - Paddy Crop Damage in Warangal

"ఉన్న భూమిలో వరి వేశాం. అప్పు తెచ్చి మరీ పెట్టుబడిగా పెట్టి వ్యవసాయం చేశాం. కానీ సోమవారం కురిసిన వానకు పంటంతా నాశనం అయింది. రెండు ఎకరాలు కౌలు చేశాం. ధాన్యాన్ని ఎండకు పోశాం కానీ కురిసిన వర్షానికి అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి." - బాధిత రైతులు

Farmers Problems Due To Untimely Rains : పరకాల వ్యవసాయ మార్కెట్‌లోనూ అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం వర్షం కారణంగా తడిసిపోయింది. కొంతమంది రైతులు టార్ఫాలిన్ కవర్లు కప్పినప్పటికీ వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. అప్పులు తీసుకువచ్చి మరీ పంటను సాగు చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసినప్పటి నుంచి వాటిపై కవర్లు వేసి కాపాడిన ఫలితం లేకుండా పోయిందని తమ గోడులను వెల్లబోసుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

నడివేసవిలో వర్షబీభత్సం - నేలరాలిన పంటలు - కొట్టుకుపోయిన ధాన్యరాశులు - SUDDEN RAINS IN TELANGANA

ప్రకృతి కన్నెర్రకు పెట్టుబడి వర్షార్పణం - అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం - crop damage in telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.