ETV Bharat / state

నడివేసవిలో వర్షబీభత్సం - నేలరాలిన పంటలు - కొట్టుకుపోయిన ధాన్యరాశులు - SUDDEN RAINS IN TELANGANA

author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 10:28 AM IST

Heavy Rains in Telangana : భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. వచ్చే నాలుగు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

People Died due to Heavy Rains
Sudden Rains in Telangana (ETV Bharat)

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం పలుచోట్ల పంట ప్రాణ నష్టం (ETV Bharat)

Heavy Rains Damage in Telangana : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానపడింది. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై వెళ్తుండగా చెట్టు కూలి ట్రాక్టర్‌పై కూర్చున్న యువకుడు మృతి చెందాడు.

People Died due to Heavy Rains : సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఈదురు గాలులకు మామిడి నేలరాలింది. భారీ వర్షానికి రహదారులపై ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. మెదక్ జిల్లాలోని తూప్రాన్, నర్సాపూర్, నిజాంపేట్, వెల్దుర్తిలో ఉరుములు, మెరుపులతో జోరువాన పడింది. కుమురం భీం జిల్లాలోని కాగజ్ నగర్, సిర్పూర్, కౌటాల, బెజ్జురు, దహేగం మండలాల్లో భారీ వర్షం పడింది. నాగేపెళ్లిలో పిడుగు పడి ఎద్దు మృతి చెందగా దహేగం మండలంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలపూర్ వద్ద కోళ్లఫారంలో గోడ కూలి ఇద్దరు మేస్త్రీలు చనిపోయారు.

వర్షం నింపిన విషాదం - బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం - Wall Collapse in Hyderabad


Crop Damage due to Sudden Rains : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో 300 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. తూకం కోసం ఎదురుచూస్తుండగా ధాన్యం రాశులు తడిసి రైతులు బోరుమంటున్నారు. ధర్మపురి, నేరెళ్ల, జైన, దొంతపూర్ కొసునూరు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. చందుర్తి, వేములవాడ కొనరావుపేట మండలంలో ధాన్యపు రాశులపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Rains : యాదాద్రి ఆలయ గగనతలంలో భారీగా మెరుపులు మెరవడంతో ఆ వెలుగుల్లో నల్లరాతి కట్టడాలు భక్తులకు కనువిందు చేశాయి. కొండపై భక్తులకు కోసం వేసిన చలువ పందిర్లు ఈదురుగాలులకు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాగల నాలుగు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలలు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు - రైతులతో పాటు నేతలను సైతం కలవరపెట్టిన వాన బీభత్సం - Heavy Rain Effects in Telangana

తెలంగాణ ప్రజలకు అలర్ట్ - నేడు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన - TELANGANA RAIN ALERT TODAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.