ETV Bharat / sports

'స్టే సేఫ్ మై చెన్నై'- తుపానుపై శ్రీలంక బౌలర్​ ట్వీట్- సీఎస్​కే ప్లేయర్​ అనిపించుకున్నాడుగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 8:07 PM IST

Updated : Dec 5, 2023, 1:10 PM IST

Matheesha Pathirana On Chennai Floods : భారీ వర్షాలు, తుపాన్ చెన్నైని కుదిపేస్తున్న నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నారు. శ్రీలంక ప్లేయర్ మతీషా పతిరణ, స్టే సేఫ్- మై చెన్నై అంటూ సోషల్ మీడియాలో తమిళనాడు పట్ల అభిమానాన్ని చాటుకున్నాడు.

pathirana on chennai floods
pathirana on chennai floods

Matheesha Pathirana On Chennai Floods : మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడులో చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి, రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అనేక మంది, తమిళనాడు తుపాన్​పై స్పందిస్తున్నారు. అయితే తాజాగా శ్రీలంక స్టార్ బౌలర్ మతీషా పతిరణ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని చెన్నై ప్రజలకు సూచించాడు.

'స్టే సేఫ్, మై చెన్నై! ప్రస్తుత పరిస్థితులు భయంకరంగా ఉన్నా, మంచి రోజులు త్వరలోనే వస్తాయి. జాగ్రత్తగా ఉండండి' అని పతిరణ అన్నాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరాడు. 'ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇవి విపత్కర పరిస్థితులు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్న అధికారులకు సెల్యూట్. ఇలాంటప్పుడే ఒకరికొకరం సహాయం చేసుకోవాలి' అని కార్తిక్ అన్నాడు.

  • Chennai folks, please prioritize your safety and stay indoors - it's crucial during times like these. A big salute to all the officials working tirelessly to improve the situation. Let's all cooperate and get through this together. 🙏#ChennaiStaySafe #CycloneMichuang

    — DK (@DineshKarthik) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Matheesha Pathirana IPL : అయితే మతీషా పతిరణ ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్​ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సమయంలోనే చెన్నైతో ఏర్పడిన బంధంతో పతిరణ ఈ విధంగా స్పందిచి ఉంటాడని నెటిజన్లు అంటున్నారు.​

ఈ తుపాన్ రానున్న రోజుల్లో తీవ్రరూపం దాల్చనున్నట్లు అధికారులు తెలిపారు. 'మిగ్‌జాం తుపాను చెన్నైకి తూర్పు-ఈశాన్యానికి 100 కి.మీ దూరంలో ఉంది. సోమవారం తెల్లవారుజామున ఇది గంటకు 10 కి.మీ వేగంతో కదిలింది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతుందని భావిస్తున్నాము. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో తుపాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో నెల్లూరు-మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని అంచనా. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో తుపాను ప్రభావం ఈ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది' అని చెన్నై రీజినల్ మెట్రాలజీ డైరెక్టర్​ బాలచంద్రన్​ పేర్కొన్నారు.

ధోని సిక్సర్లు .. లలిత్ స్టన్నింగ్​ క్యాచ్​.. సీఎస్కే-దిల్లీ మ్యాచ్​ హైలైట్స్ చూశారా?

వెకేషన్ మోడ్​లో దినేశ్​ కార్తిక్.. డిస్నీల్యాండ్​లో సందడి..

Last Updated : Dec 5, 2023, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.