ETV Bharat / sports

ఐపీఎల్​లో తొలి 'రిటైర్డ్​ ఔట్​'.. చాహల్​ అరుదైన ఘనత

author img

By

Published : Apr 11, 2022, 10:34 AM IST

Retired out in IPL: ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 15వ ఎడిషన్​ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే.. ఐపీఎల్​ చరిత్రలోనే తొలిసారి రాజస్థాన్​ రాయల్స్​ షాకింగ్​ నిర్ణయం తీసుకుంది. ఇన్నింగ్స్​ చివర్లో అశ్విన్​ను రిటైర్డ్​ ఔట్​ ప్రకటించి వెనక్కి పిలిచింది. అలా ఎందుకు చేసింది? మరోవైపు.. ఆర్ఆర్​ బౌలర్​ చాహల్​ వికెట్ల వేటలో అరుదైన ఘనత సాధించాడు.

Retired out in IPL
ఐపీఎల్​లో తొలి 'రిటైర్డ్​ ఔట్​'

Retired out in IPL: ఐపీఎల్​ చరిత్రలో రిటైర్డ్​ ఔట్​ అయిన తొలి ఆటగాడిగా అశ్విన్​ నిలిచాడు. రాజస్థాన్​ ఇన్నింగ్స్​ 19వ ఓవర్లో అతడు ఇలా వెనుదిరిగాడు. అలసిపోయి షాట్లు ఆటలేకపోతుండటం వల్ల అశ్విని వెనుదిరిగి ఉండొచ్చని అంతా భావించారు. రిటైర్డ్​ ఔట్​ అనేది ఓ వ్యూహాత్మక ఎత్తుగడ. మెరుగైన ముగింపు కోసం రాజస్థాన్​ జట్టు మేనేజ్​మెంట్​ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రిటైర్డ్​ హర్ట్​ అయిన బ్యాటర్​లో.. రిటైర్డ్​ ఔట్​ అయిన బ్యాటర్​ తిరిగి బ్యాటింగ్​ రావడానికి వీల్లేదు. అశ్విన్​ స్థానంలో క్రీజులోకి వచ్చిన రియాన్​ పరాగ్​ ఓ సిక్స్​ కొట్టాడు. ఈ మ్యాచ్​లో అశ్విన్​ 23 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు.

చివరి ఓవర్​లో అశ్విన్​ మైదానం వీడటంపై క్రికెట్​ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ అశంపై ట్విట్టర్​ వేదికగా చర్చించారు. ఐపీఎల్​లో తొలిసారి ఈ సంఘటనను చూశానని ఓ అభిమాని పోస్ట్​ చేయగా.. ఇది వ్యూహంలో భాగమని మరో అభిమాని పేర్కొన్నాడు. అశ్విన్​ స్థానంలో రియాన్​ పరాగ్​ రావటం.. గొప్ప వ్యూహంగా పలువురు పేర్కొన్నారు. మరో అభిమాని ఓ అడుగు ముందుకేసి రోహిత్​ శర్మ కంటే అశ్విన్​ మెరుగైన ప్రదర్శన చేసినట్లు తెలిపాడు.

ఆర్​ఆర్​ కెప్టెన్​ ఏమన్నాడంటే?: అశ్విన్​ రిటైర్డ్​ ఔట్​గా వెళ్లటంపై మ్యాచ్​ అనంతరం వివరణ ఇచ్చాడు రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​ సంజూ శాంసన్​. డెత్​ ఓవర్లలో అశ్విన్​ను రిటైర్డ్​ ఔట్​గా వెనక్కి పిలిపించటం.. జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశాడు. మ్యాచ్​ పరిస్థితిని అనుసరించి ఈ వ్యూహాన్ని అమలు చేశారని తెలిపాడు. తాము ఎప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, రిటైర్డ్​ ఔట్​ గురించి ముందే చర్చించినట్లు వెల్లడించాడు.

చాహల్​ అరుదైన ఘనత: ఐపీఎల్​లో భాగంగా ముంబయి వాంఖడే మైదానంలో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది రాజస్థాన్​ రాయల్స్​. ఈ మ్యాచ్​లో ఆర్​ఆర్​ 166 పరుగుల లక్ష్యాన్ని ఎల్​ఎస్​జీ ముందు ఉంచింది. అయితే.. లక్ష్య ఛేదనలో సూపర్​ జెయింట్స్​ను నాలుగు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టాడు యుజువేంద్ర చాహల్​. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దుష్మంత చమీరాను ఓట్​ చేయటం ద్వారా చాహల్​ ఐపీఎల్​లో 150వ వికెట్​ సాధించాడు. తద్వారా ఐపీఎల్​లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చాహల్​ కంటే ముందు డ్వేన్​ బ్రావో 173, లసిత్​ మలింగ్​ 170, అమిత్​ మిశ్రా 166, పియూష్​ చావ్లా 157 వికెట్లతో ముందు వరుసలో ఉన్నారు. తాజాగా చాహల్​ 150 వికెట్లతో భజ్జీ సరసన చేరాడు.

రాజస్థాన్​ జట్టులోనే ఆరెంజ్​, పర్పుల్​ క్యాప్స్​: లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​తో ఉత్కంఠ పోరులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్​లోకి దూసుకెళ్లింది రాజస్థాన్​ రాయల్స్​. 4 మ్యాచ్​లు ఆడిన ఆర్​ఆర్​ మూడింటిలో విజయం సాధించి 6 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. మంచి ఫామ్​లో ఉన్న రాయల్స్​ బ్యాటర్​ జోస్​ బట్లర్​ 218 పరుగులతో ఆరెంజ్​ క్యాప్​ను సొంతం చేసుకున్నాడు. ఎల్​ఎస్​జీ మ్యాచ్​లో 4 వికెట్లు పడగొట్టిన యుజ్వేందర్​ చాహల్​.. ఉమేశ్​ యాదవ్​, కుల్దీప్​ యాదవ్​లను వెనక్కి నెట్టి పర్పుల్​ క్యాప్​ను అందుకున్నాడు. ప్రస్తుతం తొలిస్థానంలో ఉన్న ఆర్​ఆర్​ జట్టులోనే అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల ఆటగాళ్లు ఉండటం విశేషం. చాహల్​ 4 మ్యాచుల్లో 6.5 ఎకానమితో 11 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: IPL 2022: లఖ్​నవూకు షాక్​.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్​ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.