ETV Bharat / sports

కుల్​దీప్​, ఖలీల్​ వికెట్ల పండగ.. దిల్లీ చేతిలో కోల్​కతా చిత్తు

author img

By

Published : Apr 10, 2022, 7:38 PM IST

IPL 2022 DC vs KKR
IPL 2022 DC vs KKR

DC vs KKR: కోల్​కతా నైట్​రైడర్స్​తో మ్యాచ్​లో సమష్టిగా విజృంభించిన దిల్లీ క్యాపిటల్స్​ మళ్లీ గెలుపు రుచి చూసింది. తొలుత భారీ స్కోరు చేసి.. ఆ తర్వాత కోల్​కతాను కట్టడి చేసింది. కుల్​దీప్​ 4 వికెట్లతో చెలరేగగా.. ఖలీల్​ అహ్మద్​ 3 వికెట్లు తీశాడు.

DC vs KKR: దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ ఓడిపోయింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు.. 171కే ఆలౌటైంది. శ్రేయస్​ అయ్యర్ ​(33 బంతుల్లో 54) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. నితీశ్​ రాణా(30) కాసేపు సహకారం అందించినా ఫలితం లేకపోయింది. దిల్లీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో విజయవంతమయ్యారు. ఓపెనర్లు రహానే(8), వెంకటేశ్​ అయ్యర్​(18) తక్కువ పరుగులే చేసి అవుటయ్యారు. గత మ్యాచ్​ హీరో ప్యాట్​ కమిన్స్​ ఈసారి 4 రన్సే చేశాడు. కుల్​దీప్​ యాదవ్​ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఖలీల్​ అహ్మద్​ 3, షార్దుల్​ ఠాకుర్​ 2 వికెట్లు పడగొట్టారు.

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీ క్యాపిటల్స్​ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్​ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్​కు 8.4 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. 27 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన షా 51 పరుగులకు అవుటయ్యాడు. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన పంత్​ 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి పెవిలియన్​ చేరాడు. ఆ సమయంలో లలిత్​ యాదవ్​(1), పావెల్​ను (8) వరుస ఓవర్లలో ఔట్​ చేసి కోల్​కతాను పోటీలోకి తీసుకొచ్చాడు నరైన్​. మరుసటి ఓవర్లో వార్నర్​ను 61(45 బంతుల్లో) ఉమేశ్​ ఔట్​ చేశాడు.

IPL 2022 DC vs KKR
వార్నర్​, పృథ్వీ షా

ఆఖర్లో షార్దుల్​ ఠాకుర్​, అక్షర్​ పటేల్​ ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించారు. ఠాకుర్​ 11 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. అక్షర్​ 2 ఫోర్లు, ఓ సిక్సర్​తో 14 బంతుల్లోనే 22 రన్స్​ చేశాడు. కోల్​కతా బౌలర్లలో నరైన్​ రెండు వికెట్లు తీయగా.. వరుణ్​ చక్రవర్తి, ఉమేశ్​ యాదవ్​, రసెల్​ తలో వికెట్​ తీశారు. కమిన్స్​ 4 ఓవర్లలో వికెట్​ తీయకుండా 51 పరుగులు ఇచ్చాడు. ఉమేశ్​, చక్రవర్తి కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. నరైన్​, రసెల్​ మాత్రమే కాస్త పొదుపుగా బౌలింగ్​ చేశారు. తొలుత టాస్​ గెలిచిన కేకేఆర్​.. దిల్లీకి బ్యాటింగ్​ అప్పగించింది. దిల్లీలో నోర్జే స్థానంలో ఖలీల్​ అహ్మద్​ జట్టులోకి వచ్చాడు. కోల్​కతా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

ఇవీ చూడండి: ముంబయికి కలిసిరాని మెగా ఆక్షన్​​.. గతంలోనూ వరుస ఓటములు

'బేబీ ఏబీ' అరుదైన రికార్డు.. ఐపీఎల్​లో రెండో ప్లేయర్​గా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.