ETV Bharat / sports

ఊపుమీదున్న టీమ్ఇండియా- డిఫెన్స్​లో పడ్డ ఆసీస్​, జట్టులో కీలక మార్పులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 3:50 PM IST

Updated : Nov 28, 2023, 4:38 PM IST

India Vs Australia T20 Series New Squad : ఇటీవల వన్డే వరల్డ్​ కప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్​తో టీ20 సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్​ల్లో టీమ్ఇండియా చేతిలో ఓడిపోయింది. దీంతో డిఫెన్స్​లో పడ్డ కంగారూ జట్టు యాజమాన్యం జట్టులో కీలక మార్పులు చేసింది.

India Vs Australia T20 Series New Squad
India Vs Australia T20 Series New Squad

India Vs Australia T20 Series New Squad : ప్రస్తుతం టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ భారత్​ విజయం సాధించింది. దీంతో ఆసీస్​ క్రికెట్​ బోర్డు డిఫెన్స్​లో పడింది. టీమ్​ను పూర్తిగా మార్చేస్తోంది. ప్రస్తుతం టీమ్​లోని ఆరుగురు ప్లేయర్లను ఇంటికి పంపిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. ఆ స్థానంలో కొత్త ప్లేయర్లను తీసుకోనున్నట్లు ప్రకటించింది. మూడో టీ20 మ్యాచ్​ జరగడానికి కొన్ని గంటల ముందు ఆసీస్ జట్టు యాజమాన్యం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

అయితే ఇప్పటికే ఆసీస్​ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, బౌలర్ ఆడమ్ జంపా స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో వీరు మూడో టీ20కి అందుబాటులో లేరు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మిగతా నలుగు ప్లేయర్లు.. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్ కూడా ఆస్ట్రేలియా వెళ్లిపోనున్నారు. అయితే వీరి స్థానంలో తీసుకున్న నలుగురు ప్లేయర్లలో ఇప్పటికే జోశ్ ఫిపిప్, బెన్ మెక్​డెర్మాట్ భారత్​కు చేరుకున్నారు. మిగతా నలుగురు ప్లేయర్లు బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్​లు మూడో మ్యాచ్​ తర్వాత జట్టులో చేరనున్నారు.

ఆస్ట్రేలియా కొత్త జట్టు : మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), బెహ్రెన్ డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్‌ ఎలిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్‌ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్‌ మెక్‌డెర్మాట్, జోశ్ ఫిలిప్, తన్వీర్‌ సంఘ, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్

AUS Vs IND 3rd T20 2023 : తొలి రెండు టీ20ల్లో నెగ్గి ఊపుమీదున్న టీమ్ఇండియా.. మూడో మ్యాచ్​లోనూ గెలిచి సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. మరోవైపు వరల్డ్​ కప్​ గెలిచిన జట్టుగా.. ఈ మ్యాచ్​లోనైనా నెగ్గి సిరీస్​లో బోణీ కొట్టాలని ఆసీస్ ఆశిస్తోంది. అయితే అన్ని విభాగాల్లో దుకుడుగా ఆడుతున్న భారత్​ను ఎదుర్కొవడం అంత తేలికైన విషయం కాదు. టీమ్ఇండియా టాప్​ ఆర్డర్ యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్​ అద్భతమైన ఫామ్​లో ఉన్నారు. రెండో టీ20 మ్యాచ్​లో ఈ ముగ్గురూ 50+ స్కోర్లు చేసి.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. ఇక కెప్టెన్ సూర్య, లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ మిడిలార్డర్​లో, చివర్లో రింకు సింగ్ రాణిస్తే.. టీమ్ఇండియా ముచ్చటగా మూడోసారి 200+ స్కోర్ నమోదు చేస్తుందనడంలో సందేహం లేదు.

ఐపీఎల్ హిస్టరీలోనే యంగ్​ కెప్టెన్​గా విరాట్ - లిస్ట్​లో పంత్, గిల్ - ఇంకా ఎవరంటే?

మొహంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ - ఈ ఫొటో మెసేజ్​ ఏంటంటే?

Last Updated : Nov 28, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.