ETV Bharat / sports

IND vs SL Asia Cup 2023 Final : ఐదేళ్ల నిరీక్షణకు అడుగు దూరంలో భారత్.. డిఫెండింగ్ ఛాంప్​ను ఆపగలమా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 10:32 PM IST

Updated : Sep 16, 2023, 10:47 PM IST

IND vs SL Asia Cup 2023 Final : 2023 ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్​లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మకమైన పోరుకు కొలంబో పి. ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది.

Ind vs Sl Asia Cup 2023 Final
Ind vs Sl Asia Cup 2023 Final

IND vs SL Asia Cup 2023 Final : 2023 ఆసియా కప్ ఫైనల్‌ ఆదివారం కొలంబో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, శ్రీలంక జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక.. ఆసియా కప్‌ చరిత్రలో అత్యధికసార్లు (13) ఫైనల్​కు చేరిన జట్టుగా రికార్డు కొట్టింది. లంక తర్వాత భారత్ 11 సార్లు ఫైనల్​ చేరుకుంది. కానీ భారత్ ఖాతాలో 7 ఆసియా కప్​ టైటిళ్లు ఉండగా.. లంక ఆరుసార్లు మాత్రమే ఛాంపియన్​గా నిలిచింది.

ఆదివారం జరగబోయే తుదిపోరులో గెలిచి.. భారత్​తో టైటిళ్ల రికార్డును సమం చేయాలని శ్రీలంక భావిస్తోంది. మరోవైపు బహుళ జట్ల టోర్నీల్లో గత ఐదేళ్లుగా ఒక్క టైటిల్ గెలవని భారత్.. ఈసారి ఛాంపియన్​గా నిలవాలని తహతహలాడుతోంది. మరి టీమ్ఇండియాకు కీలకం కానున్న ప్లేయర్లెవరో చూసేద్దామా!

టాపార్డర్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్.. ఈ టోర్నీలో భారత్​కు మంచి శుభారంభాలు ఇచ్చారు. చివరి మ్యాచ్​ మినహా.. వరుసగా మూడుసార్లు రోహిత్ అర్ధ శతకాలు బాదడం, అటు గిల్ బంగ్లాతో మ్యాచ్​లో శతకంతో టచ్​లోకి రావడం భారత్​కు కలిసొచ్చే అంశాలు. ఇక స్టార్ బ్యాటర్ కోహ్లీ.. పాకిస్థాన్​పై సూపర్ సెంచరీతో పాత విరాట్​ను గుర్తు చేశాడు. గత మ్యాచ్​లో విశ్రాంతి తీసుకున్న విరాట్ ఫైనల్​లో చెలరేగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పవు.

మిడిలార్డర్.. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు కేఎల్ రాహుల్. ఈ టైమ్​లో తన​ ఫామ్​పై ఎన్నో సందేహాలున్న వేళ.. పాక్​పై అద్భుత సెంచరీ నమోదు చేసి సత్తా చాటుకున్నాడు. మరోసారి అతడు బ్యాట్ ఝలిపిస్తే.. టీమ్ఇండియాకు భారీ స్కోర్ ఖాయం. ఇక మరో బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో నిలకడగానే రాణిస్తున్నాడు. ఇషాన్ కూడా మిడిలార్డర్​లో మంచి పార్ట్​నర్​షిప్ ఇవ్వగలిగితే భారత్​ను ఆపడం లంకకు అసాధ్యం.

బౌలింగ్ విభాగం.. వరుస రోజుల్లో పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్​ల్లో ఏకంగా తొమ్మిది వికెట్లతో దుమ్ముదులిపాడు కుల్​దీప్ యాదవ్. మరోవైపు ఏడాది తర్వాత జట్టులకి వచ్చిన జస్​ప్రీత్ బుమ్రా కూడా తన లయను అందిపుచ్చుకున్నాడు. పెద్దగా వికెట్లు పడగొట్టకపోయినా.. పరుగులు కట్టడి చేయడంలో బుమ్రా సక్సెస్​ అయ్యాడు. వీరిద్దరికీ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా తోడైతే.. లంక శాసించడం పెద్ద విషయమేమీ కాదు.

కొలంబో వాతావరణం..
ఆసియా కప్​ ప్రారంభమైనప్పటి నుంచి.. శ్రీలంకలో పలు మ్యాచ్​లకు వర్షం ఆటంకం కలిగించింది. అయితే ఫైనల్​ మ్యాచ్​కు సైతం కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ ఆదివారం మ్యాచ్​కు వర్షం అంతరాయం కలిగిస్తే.. రిజర్వ్ డే సోమవారం మ్యాచ్ కొనసాగుతుంది. ఇక సోమవారం కూడా మ్యాచ్ ఫలితం రాకపోతే ఇరుజట్లు సంయుక్త విజేతలుగా నిలుస్తాయి.

Ind Vs Ban Asia Cup Records : 1000కి పైగా పరుగులు.. ఏడాదిలో ఆరో సెంచరీ.. భారత్​-బంగ్లా మ్యాచ్ రికార్డ్స్​ ఇవే

Kohli Funny Run Viral Video : 'ఏంటీ కోహ్లీ అలా పరిగెడుతున్నావ్​?'.. ఒక్కసారిగా అంతా నవ్వులే నవ్వులు!

Last Updated : Sep 16, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.