ETV Bharat / sports

KL Rahul Asia Cup 2023 : వాట్​ ఏ కమ్​ బ్యాక్ రాహుల్​.​.. ఆ ఒక్క పనితో ధోనీని గుర్తుచేశావుగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 9:15 AM IST

KL Rahul Asia Cup 2023
KL Rahul Asia Cup 2023

KL Rahul Asia Cup 2023 : ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత క్రీజులోకి అడుగుపెట్టిన కేఎల్​ రాహుల్​ తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కీలక ఇన్నింగ్స్​లో పరుగుల వరద పారించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మైదానంలో బ్యాట్​లో చెలరేగే ఈ స్టార్​ ప్లేయర్​.. తాజాగా వికెట్​ కీపర్​గానూ సత్తా చాటాడు. అయితే రాహుల్​ చేసిన ఓ పని మాత్రం అచ్చం ధోనీ చేసినట్లు ఉందని ఫ్యాన్స్​ అభిప్రాయపడ్డారు. ఇంతకీ అదేంటంటే..

KL Rahul Asia Cup 2023 : ఆసియా కప్​లో భాగంగా జరిగిన భారత్​-పాక్​ సూపర్ 4 మ్యాచ్​తో కమ్​బ్యాక్​ ఇచ్చిన టీమ్ఇం​డియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో దుమ్మురేపుతున్నాడు. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయర్​.. సూపర్​-4 జరిగిన మ్యాచ్​లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకంగా మారాడు. ఇక అదే జోరును కొనసాగిస్తున్న రాహుల్​.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇషాన్ కిషన్​తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన అతడు బ్యాటింగ్​లో సత్తా చాటాడు. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో తాజాగా ​ వికెట్ కీపర్‌గానూ తన ట్యాలెంట్​ను చూపించాడు. అలా మాజీ క్రికెటర్​ మిస్టర్​ కూల్ ధోనీని తలపించాడు.

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్న సమయంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ జోడీ ఓ వెలుగు వెలిగింది. వికెట్ల వెనుకాల ఉన్న ధోనీ బ్యాటర్ల కదిలికలను పసిగట్టి మరీ ఈ ఇద్దరికీ సలహాలు ఇచ్చేవాడు. అతని సూచనలకు తగ్గట్లుగానే బౌలింగ్ చేసే కుల్దీప్​, చాహల్​ వికెట్లును పడగొట్టేవారు. తాజాగా కేఎల్ రాహుల్ చేసిన ఓ పని కూడా ధోనీని తలపించింది.

రాహుల్ ఇచ్చిన సలహాలతో బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్.. సమర విక్రమార్క‌ను స్టంపౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. 18వ ఓవర్‌కు ముందు కుల్దీప్ యాదవ్‌తో రాహుల్ చర్చించగా.. మూడో బంతికి సమరవిక్రమార్క స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజాకు కూడా పలు సూచనలు చేస్తూ కనిపించాడు. నెమ్మదిగా బౌలింగ్ చేయాలని, వేగంగా బౌలింగ్ బంతి టర్న్ అవ్వడం లేదంటూ చెప్పాడు. రాహుల్ సూచనల మేరకు మూడు బంతులను నెమ్మదిగా వేయడం వల్ల శ్రీలంక బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వేగంగా వేయడం వల్ల శ్రీలంక బ్యాటర్ బౌండరీకి తరలించాడు. దాంతో వికెట్లు తీసే విషయంలో రాహుల్ సూచనలు కీలకమనే విషయం అర్థమైంది.

అయితే ఈ మ్యాచ్​లో రాహుల్​ వికెట్​ కీపింగ్​ చూసిన అభిమానులు.. రాహుల్​ను చూస్తే ధోనీ గుర్తొచ్చాడంటూ నెట్టింట ఆ వికెట్​ కీపింగ్​ వీడియోనూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక తన కమ్​బ్యాక్​తో రాహుల్​ కీలక ఇన్నింగ్స్ ఆడి ఇలా జట్టుకు సపోర్టింగ్ సిస్టమ్​గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం..

Atiya Shetty KL Rahul : భర్త సెంచరీపై అతియా ఎమోషనల్​ పోస్ట్.. అతనే నెంబర్​ వన్ అంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.