ETV Bharat / sports

రాణించిన ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్.. భారత్ లక్ష్యం 189

author img

By

Published : Oct 18, 2021, 9:10 PM IST

IND vs ENG
భారత్

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్ వార్మప్​ మ్యాచ్​లో భారత బౌలర్లు తేలిపోయారు. ఇంగ్లాండ్ బ్యాట్స్​మెన్ రెచ్చిపోవడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. బెయిర్​స్టో (49), మొయిన్ అలీ (43) రాణించారు.

టీ20 ప్రపంచకప్​లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగుతోంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో అసలు పోరుకు ముందు వార్మప్ మ్యాచ్​లు ఆడుతోంది. ఇందులో భాగంగా నేడు (అక్టోబర్ 18) ఇంగ్లాండ్​తో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్​లో మొదట బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీసేన.. ఇంగ్లాండ్​ను కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ సాధించింది ఇంగ్లీష్ జట్టు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​కు శుభారంభం అందించేందుకు కృషి చేశారు ఓపెనర్లు జాసన్ రాయ్ (17), బట్లర్(18). కానీ వీరిద్దరినీ పెవిలియన్ చేర్చి భారత శిబిరంలో ఆనందం నింపాడు షమీ. తర్వాత వచ్చిన డేవిడ్ మలన్ (18) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అనంతరం బెయిర్​స్టో, లివింగ్​స్టోన్ గొప్పగా ఆడారు. భారత బౌలర్లను సమర్థవంతంగా కాచుకుంటూ పరుగులు సాధించారు. వీరి ఇన్నింగ్స్​ దూకుడుగా సాగుతున్న క్రమంలో లివింగ్​స్టోన్​ (30)ను బౌల్డ్ చేశాడు షమీ. హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో బెయిర్​స్టో (49)ను బుమ్రా బోల్తా కొట్టించడం వల్ల 163 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. చివర్లో మొయిన్ అలీ (43) కాసేపు మెరవడం వల్ల వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది మోర్గాన్ సేన.

భారత బౌలర్లలో షమీ నాలుగు ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 40 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.

ఇవీ చూడండి: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. ఐరిష్ బౌలర్ సూపర్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.