ETV Bharat / sports

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. ఐరిష్ బౌలర్ సూపర్ రికార్డు

author img

By

Published : Oct 18, 2021, 6:29 PM IST

Updated : Oct 18, 2021, 6:38 PM IST

Campher
కర్టిస్

నెదర్లాండ్స్​(ire vs ned t20)తో జరిగిన టీ20 ప్రపంచకప్(T20 world cup 2021) క్వాలిఫయింగ్ మ్యాచ్​లో రికార్డు నెలకొల్పాడు ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్(curtis campher t20). వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

అబుదాబి వేదికగా ఐర్లాండ్-నెదర్లాండ్స్(ire vs ned t20) మధ్య టీ20 ప్రపంచకప్-2021(T20 world cup 2021) క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టు పతనంలో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్(curtis campher t20) కీలకపాత్ర పోషించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్​గా రికార్డులకెక్కాడు.

10వ ఓవర్ వేసిన కాంఫర్(curtis campher t20).. ఈ ఓవర్​లో వరుసగా ఆక్​మన్ (11) టెన్ డచ్​టే (0), స్కాట్ ఎడ్వర్డ్స్ (0), వాన్​డర్ మెర్వ్(0)​లను పెవిలియన్ పంపాడు. దీంతో టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్​గా ఘనత సాధించాడు కాంఫర్. ఇంతకుముందు లంక పేసర్ మలింగ (2007 టీ20 ప్రపంచకప్, 2019లో న్యూజిలాండ్​తో టీ20) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. 2019లో ఐర్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఐర్లాండ్ విజయం

107 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలో దిగిన ఐర్లాండ్.. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గెరెత్ డెలానీ (29 బంతుల్లో 44 పరుగులు)కి తోడు పాల్ స్టెర్లింగ్ (30) రాణించడం వల్ల 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇవీ చూడండి: అప్పుడు డెలివరీ బాయ్.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్​తో స్టార్​గా!

Last Updated :Oct 18, 2021, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.