ETV Bharat / sports

వరల్డ్​ కప్​ మహాసంగ్రామం- వ్యూహాలకు టీమ్​ఇండియా పదును- 'బిలియన్ డ్రీమ్స్' సాకారమయ్యేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 5:08 PM IST

India Vs Australia World Cup 2023 Final Preview : ప్రపంచకప్‌లో మహా సంగ్రామానికి టీమ్​ఇండియా సిద్ధమైంది. ఆదివారం జరిగే తుది పోరులో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా, రెండుసార్లు టోర్నీ విజేత భారత్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీమ్​ఇండియా విజయం కోసం 130 కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యులైన.. విరాట్ కోహ్లి, అశ్విన్‌.. మరోసారి ఆ అనుభూతిని పొందాలని పట్టుదలతో ఉన్నారు. ఏమాత్రం ఎమరుపాటు లేకుండా.. ముచ్చటగా మూడోసారి కప్పును గెలిచేందుకు రోహిత్‌ సేన వ్యూహాలకు పదునుపెడుతోంది.

India Vs Australia World Cup 2023 Final Preview
India Vs Australia World Cup 2023 Final Preview

India Vs Australia World Cup 2023 Final Preview : ప్రతిష్టాత్మక లార్డ్స్‌ స్టేడియంలో 1983లో కపిల్‌ దేవ్‌ కప్పును ఎత్తిన క్షణాలను.. 2011లో ధోని సిక్సు కొట్టి గెలిపించిన అనుభూతులను.. మరోసారి కళ్లారా వీక్షించాలని క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో జరుగుతున్న.. ప్రపంచకప్‌ తుది పోరులో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా విజయం సాధించాలని కోట్లమంది క్రికెట్‌ అభిమానులు.. ఆశిస్తున్నారు. కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలను మోస్తున్న రోహిత్‌సేన.. తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని, ఒత్తిడి తమపై ఎప్పుడూ ఉండేదేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అప్రతిహతంగా పది విజయాలతో ఫైనల్‌ చేరిన భారత్‌.. 11వ మ్యాచ్‌లోనూ గెలిచి ఓటమే లేకుండా ప్రపంచకప్‌ ఒడిసిపట్టాలనే పట్టుదలతో.. కసరత్తు చేస్తోంది. సారథి రోహిత్‌ సహా క్రికెటర్లంతా తమ కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మ్యాచ్‌ను ఆడేందుకు సిద్ధమయ్యారు.

అన్ని విభాగాల్లో పటిష్ఠంగా భారత్..
ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం నుంచి.. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సమష్టిగా రాణిస్తున్న భారత్‌ మరోసారి సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. భారత బ్యాటింగ్‌లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్‌ శర్మ ఈ టోర్నీలో ఇప్పటికే 550 పరుగులు చేసి దూకుడుపై ఉండగా.. 90 సగటుతో విరాట్ కోహ్లి 711 పరుగులు చేసి.. ఈ ప్రపంచకప్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్.... సెమీఫైనల్లో సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాహుల్‌ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తోఅలరిస్తున్నాడు. గిల్‌, జడేజాలు కూడా ఫామ్‌లో ఉన్నారు. కేఎల్​ రాహుల్ ప్రశాంతత, రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ నైపుణ్యం టీమ్​ఇండియాకు.. అదనపు బలంగా మారాయి.

అశ్విన్ ఇన్ - సిరాజ్ ఔట్​!
భారత్‌ బౌలింగ్‌లో అమ్రోహాఎక్స్‌ప్రెస్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న స్పీడ్‌ స్టార్‌ మహమ్మద్ షమీపై.. భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు.. 23వికెట్లతో షమీ ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. జస్‌ప్రీత్ బూమ్రా, మహ్మద్‌ సిరాజ్‌ కూడా అంచనాల మేరకు రాణిస్తే .. ఆస్ట్రేలియాపై గెలుపు భారత జట్టు నల్లేరుపై నడకేనని అభిమానులు ఆశిస్తున్నారు. నల్లమట్టి పిచ్‌పై.. ఈ మ్యాచ్‌ జరగనున్నందున... ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను మూడో స్పిన్నర్‌గా జట్టులోకి తీసుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. అదే జరిగితే.. సిరాజ్‌ బెంచ్‌కు పరిమితం కాకా తప్పని పరిస్థితి.

ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. కంగారూలు ఏమార్చుతారు!
అటు.. ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్​ల్లో ఘోర పరాజయాల నుంచి కోలుకుని తర్వాత వరుస విజయాలతో ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా.. తుదిపోరులో కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఫైనల్లో భారత జట్టు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించక తప్పదని రోహిత్‌ సేనను.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరించారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌.. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచుల్లో 528 పరుగులు చేసి జోరుమీదున్నాడు. వార్నర్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌ చేరిస్తే టిమ్​ఇండియా పని అంత సులువు కానుంది. సౌతాఫ్రికాతో.. సెమీ ఫైనల్లో ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మెరిసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో.. మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం ఎప్పటికీ గుర్తుంటుంది. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా మ్యాక్స్‌వెల్‌ సొంతం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు పటిష్ట వ్యూహరచనతో ముందుకు సాగాలని.. మాజీలు సూచిస్తున్నారు.

ఆసీస్​ బౌలింగ్​- కట్టడి చేయగలదా?
బౌలింగ్‌ విభాగంలోనూ ఆస్ట్రేలియా బలంగానే ఉంది. మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపా, కామరూన్‌ గ్రీన్‌వంటి బౌలర్లతో.. ఆసీస్‌ పటిష్టంగా ఉంది. అయితే ప్రస్బుతం భారత జట్టు ఉన్న భీకర ఫామ్‌కు ఆస్ట్రేలియా.. ఎంతవరకు పోటీ ఇస్తుందనే ప్రశ్న అభిమానుల్లో ఉత్సుకత రేపుతోంది.

కోహ్లీని ఊరిస్తున్న మరిన్ని రికార్డులు- సచిన్​ను అధిగమించగలడా?

ఫైనల్ ఫీవర్​- జెర్సీలు ధరించి హోమాలు, క్రికెట్​ గణేశ్​కు పూజలు- భారత్​ గెలవాలని ఫ్యాన్స్​ తీరొక్క మొక్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.