ETV Bharat / sports

Rashid Khan: 'మళ్లీ ఆ బాధ్యతలు వద్దు'

author img

By

Published : Jun 4, 2021, 5:31 AM IST

జాతీయ జట్టుకు మరోసారి కెప్టెన్​గా వ్యవహరించాలని తాను భావించట్లేదని అన్నాడు ఆ దేశ క్రికెటర్​ రషీద్​ ఖాన్(Rashid Khan)​. సారథి బాధ్యతలు స్వీకరిస్తే తన ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశముందని చెప్పాడు.

Rashid Khan
రషీద్​ ఖాన్

అప్ఘానిస్థాన్​ క్రికెట్​ జట్టుకు సారథిగా మళ్లీ బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు ఆ దేశ స్పిన్​బౌలర్​​ రషీద్​ ఖాన్(Rashid Khan)​. ఇటీవల అస్గర్​ అఫ్ఘాన్​పై వేటు వేసిన బోర్డు.. టెస్టు, వన్డేలకు హస్మతుల్లా షాహిదిని సారథిగా, రహ్మత్​ షాను వైస్​ కెప్టెన్​గా నియమించింది. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్​కు సారథిగా రషీద్​ను తీసుకుంటుందని అభిమానులు ఆశించారు. కానీ అతడిని వైస్​ కెప్టెన్​గా ఎంపిక చేసి.. ఆ ఫార్మాట్​కు ఇంకా సారథిని నియమించలేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రషీద్​.. తనకు కెప్టెన్సీపై ప్రస్తుతం మోజు లేదని అన్నాడు. ఆ పగ్గాలు అందుకుంటే తన ప్రదర్శనపై ప్రభావం పడుతుందని చెప్పాడు.

"ఓ ఆటగాడిగా జట్టు కోసం మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాను. కెప్టెన్​గా ఉండి పలు విషయాలపై దృష్టి సారించడం కన్నా ఓ ఆటగాడిగా నా ప్రదర్శన టీమ్​కు చాలా అవాసరం. త్వరలోనే ఎంతో ముఖ్యమైన ప్రపంచకప్ రాబోతుంది. కాబట్టి కెప్టెన్​గా ఉంటే నా ఆటపై ప్రభావం పడొచ్చు. కాబట్టి ఆ బాధ్యతలు స్వీకరించాలనుకోవట్లేదు. ఓ ప్లేయర్​గా చాలా సంతోషంగా ఉన్నాను. బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి నా మద్దతు ఉంటుంది." అని రషీద్ అన్నాడు.​ రషీద్​ ఖాన్​.. వన్డేల్లో(ఏడు), టెస్టుల్లో(రెండు), టీ20ల్లో ఏడుసార్లు కెప్టెన్​గా వ్యవహరించాడు.

ఇదీ చూడండి 'బుమ్రా బౌలింగ్​ టెక్నిక్​ అతడికే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.