ETV Bharat / sports

'షాట్ల ఎంపికలో పంత్​ తెలివిగా ఉండాలి'

author img

By

Published : Feb 8, 2021, 9:40 AM IST

దూకుడుగా బ్యాటింగ్​ చేసే రిషభ్​పంత్..​ జట్టు అవసరాలకు అనుగుణంగా ఇంకా తెలివిగా ఆడాలని సూచించాడు టీమ్​ ఇండియా నయావాల్​ పుజారా. ఎక్కవ సేపు క్రీజులో ఉంటూ.. వీలైనన్నీ భాగస్వామ్యాలు నమోదు చేయాలని తెలిపాడు.

Watch | Pant doesn't need to change his game but he can be sensible in putting team first: Pujara
'షాట్ల ఎంపికలో పంత్​ తెలివిగా ఉండాలి'

దూకుడుగా ఆడటం రిషభ్​పంత్​కు సహజంగా వచ్చిందని భారత సీనియర్​ బ్యాట్స్​మెన్​ ఛెతేశ్వర్​ పుజారా తెలిపాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అతడు ఇంకా తెలివైన షాట్లు ఎంచుకోవాలని సూచించాడు.

రిషభ్​పంత్​.. కేవలం 88 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును గాడిలో పడేసే ప్రయత్నం చేశాడు. కానీ, ఓ పేలవ షాట్​ వల్ల తిరిగి టీమ్​ఇండియా 257 పరుగుల వద్ద ఆరో వికెట్​ కోల్పోయింది.

దూకుడుగా ఆడటం పంత్​ సహజసిద్ధమైన ఆట. ఈ విషయంలో అతనికి అడ్డుచెప్పలేం. అతనలాగే ధాటిగా ఆడాలి. కానీ, ఏ షాట్​ ఆడాలో? ఏది ఆడకూడదో? అతనికి తెలియాలి. అతను క్రీజులో ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఆడాలి. పంత్​ చేస్తున్న పొరపాట్ల నుంచి అతను చాలా నేర్చుకోవాలి. జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్​ చేయాలి. మరిన్ని భాగస్వామ్యాలు నమోదు చేయాలి. పిచ్​ కొంచెం స్పిన్​కు సహకరిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్​కూ అనుకూలంగానే ఉంది. మేం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. నాలు రోజు ఆట కీలకం కానుంది.

-ఛెతేశ్వర్​ పుజారా, భారత సీనియర్​ బ్యాట్స్​మెన్​.

బ్యాటింగ్​లో కొన్ని అంశాలు తమకు అనుకూలంగా లేవని పుజారా పేర్కొన్నాడు. నేను, రహానె ఔటైనా విధానాలు కలిసి రాలేదని తెలిపాడు. ఈ రెండు మాకెంతో ముఖ్యమైన వికెట్లని నయావాల్​ అభిప్రాయపడ్డాడు. అయితే అశ్విన్​, వాషింగ్టన్​ సుందర్​లు అద్భుతమైన బ్యాటింగ్​ చేస్తున్నారని పుజారా అన్నాడు.

ఇదీ చదవండి: 'అలా ఔట్​ అవ్వడం దురదృష్టకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.