ETV Bharat / sports

'ప్రపంచంలోనే భారత్ అత్యుత్తమ జట్టు'

author img

By

Published : Sep 7, 2021, 9:46 AM IST

50 ఏళ్ల తర్వాత ఓవల్​లో(Ind vs Eng Oval Test) అద్భుత విజయం సాధించిన టీమ్​ఇండియాపై ప్రశంసల వర్షం కురిపించారు పలువురు ప్రముఖులు. ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టెస్టులో భారత్​ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు మాజీలు కోహ్లీసేన ప్రదర్శనను కొనియాడుతూ ట్వీట్లు పెట్టారు.

team india
టీమ్ఇండియా

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ టీమ్​ఇండియా మరో సరికొత్త ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్​తో జరిగిన నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test) విజయం సాధించడమే కాక.. ఏళ్ల నాటి చరిత్రను తిరగరాసింది. 50 ఏళ్ల తర్వాత ఓవల్​లో భారత్​ టెస్టు(Ind vs Eng Oval Test) విజయం సాధించింది. ఆ మైదానంలో ఓటమి ఎరుగని ఇంగ్లీష్​ జట్టును మట్టికరిపించింది. ఇంతటి చారిత్రక విజయాన్ని నమోదు చేసిన భారత జట్టును.. పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు.

ప్రముఖుల ట్వీట్స్..

"ఎన్ని అవాంతరాలు ఎదురైనా తిరిగి పుంజుకుని విజయం సాధించే జట్టునే టీమ్​ ఇండియా" అంటారని వీరేంద్ర సెహ్వాగ్​ అన్నాడు. భారత జట్టును చూస్తే గర్వంగా ఉందని​ ట్వీట్​ చేశాడు.

ఈ టెస్టు మ్యాచ్​ విజయం చాలా స్పెషల్ అని అన్నాడు మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. "మొదటి రోజు 127/7 స్కోరు సాధించిన టీమ్​ఇండియా.. తిరిగి పుంజుకుని టెస్టు గెలిచింది. ఈ విధంగా పుంజుకోవడం అంత సులభం కాదు. అందుకే ఇది భారత జట్టు అయింది. అందరికీ కంగ్రాట్స్" అని ట్వీట్ చేశాడు.

"భారత్​ది అత్యుత్తమ ప్రదర్శన. మంచి నైపుణ్యం ఉండటం ఒకెత్తు. ఒత్తిడిని అధిగమించి గెలవడం మరో ఎత్తు. టీమ్​ఇండియా ఇతర జట్లకన్నా ముందంజలో ఉంది."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

"కోహ్లీసేనకు కంగ్రాట్స్. టీమ్​ఇండియా చక్కటి ప్రదర్శన చేసి అద్భుత విజయం సాధించింది. గత 12 నెలల నుంచి జట్టు పలు ఘనతలు సాధించడం హర్షనీయం. ప్రపంచంలోని జట్లలో భారత్​ అత్యుత్తమ జట్టు. ఈ టైటిల్​ పొందే అర్హత భారత్​కే ఉంది."

-షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.

"ఐదు రోజుల గొప్ప టెస్టు క్రికెట్ ఇది. భారత జట్టు బలంగా ఉంది. కోహ్లీ మంచి వ్యూహాలు రచించాడు. జట్టును ముందుండి నడిపించాడు."

-మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.

ఓవల్​ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test 2021) ఇంగ్లాండ్​పై 157 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 2-1 తేడాతో భారత్​ ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇదీ చదవండి:

IND Vs ENG: నాలుగో టెస్టు హైలైట్స్​!

ఆ నమ్మకంతోనే బరిలో దిగాం: కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.