ETV Bharat / sports

కోహ్లీసేన భయపడాల్సిన పనిలేదు: అక్తర్​

author img

By

Published : Mar 2, 2021, 10:17 PM IST

ఇంగ్లాండ్​, టీమ్ఇండియా మధ్య జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడంపై పాకిస్థాన్​ మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​ విమర్శించాడు. మొతేరా లాంటి పిచ్​ టెస్టులకు మంచిది కాదని అన్నాడు. ఇలాంటి పిచ్​లను తయారు చేసుకోవాల్సిన అవసరం కోహ్లీసేనకు లేదని తెలిపాడు.

team india can beat england on any wicket, Says Shoaib Akhtar
కోహ్లీసేన భయపడాల్సిన పనిలేదు: అక్తర్​

భారత్, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా విమర్శలు గుప్పించాడు. ఇలాంటి పిచ్‌లపై టెస్టు క్రికెట్‌ నిర్వహించరాదన్నాడు. మొతేరా పిచ్‌పై బంతి మరీ ఎక్కువగా తిరిగిందని, అది టెస్టు క్రికెట్‌కు మంచిది కాదని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో చెప్పుకొచ్చాడు.

"హోమ్‌ అడ్వాంటేజ్‌ను అర్థం చేసుకుంటాను. కానీ, ఇది మరీ అతిగా అనిపిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 400 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ 200 స్కోరుకు ఔటైతే.. అప్పుడు ఇంగ్లీష్‌ జట్టు బాగా ఆడలేదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ టీమ్‌ఇండియా కూడా 145 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ కన్నా కోహ్లీసేనే బలమైన జట్టు అని నేను భావిస్తున్నా. ఎలాంటి పిచ్‌ మీద ఆడినా టీమ్‌ఇండియా గెలుస్తుంది. వాళ్లు భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి వికెట్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియాకు అనుకూలంగా పిచ్‌లు తయారు చేశారా? అక్కడెలా గెలిచారు? సరైన పిచ్‌లపై బాగా ఆడి గెలుపొంది.. అప్పుడు మేం ఇంటా, బయటా బాగా ఆడగలమని చెప్పొచ్చు."

- షోయబ్​ అక్తర్​, పాకిస్థాన్​ మాజీ బౌలర్​

ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం నెలకొల్పిన టీమ్ఇండియా కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని అక్తర్​ అన్నాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు మంచి పిచ్​ను సిద్ధం చేసి గెలవాలని కోహ్లీసేనకు సూచించాడు.

ఇదిలా ఉండగా, సిరీస్​లోని తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్‌.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో ప్రస్తుతం భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కోహ్లీసేన నాలుగో టెస్టును సైతం తమ ఖాతాలో వేసుకొని.. సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో పోటీపడాలని పట్టుదలగా ఉంది.

ఇదీ చూడండి: పెళ్లికి సిద్ధమైన టీమ్ఇండియా పేసర్​ బుమ్రా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.