ETV Bharat / sports

డికాక్​ నిర్ణయం వ్యక్తిగతం: క్రికెట్ సౌతాఫ్రికా

author img

By

Published : Oct 26, 2021, 8:15 PM IST

De Kock
డికాక్

వెస్టిండీస్​తో మ్యాచ్​కు(WI vs SA Match) అరగంట ముందు దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్(Quinton De Kock News) తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగతంగా పరిగణించింది క్రికెట్ సౌతాఫ్రికా. బ్లాక్​ లివ్స్​ మ్యాటర్​కు(Black Lives Matter) మద్దతుగా ప్రతి మ్యాచ్​ ముందు మోకాళ్లపై కూర్చుని మద్దతు తెలపాలని సీఎస్​ఏ.. ఆటగాళ్లకు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో డికాక్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

టీ20 ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం వెస్టిండీస్​తో(WI vs SA t20 Match) జరిగిన మ్యాచ్​ నుంచి అనూహ్యంగా తప్పుకొన్నాడు దక్షిణాఫ్రికా కీపర్, బ్యాటర్ క్వింటన్ డికాక్(Quinton De Kock News). కీలక మ్యాచ్​కు కొద్ది సమయం ముందే తాను వైదొలుగుతున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ మ్యాచ్​ ఆడట్లేదని మేనేజ్​మెంట్​కు స్పష్టం చేశాడు. కాగా.. ప్రతి మ్యాచ్​ ముందు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని బ్లాక్​ లివ్స్ మ్యాటర్​కు(Black Lives Matter) సంఘీభావం తెలపాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డికాక్​ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

మోకాలిపై కూర్చోవడం ఇష్టం లేకే డికాక్ ఈ మ్యాచ్​ నుంచి తప్పుకొన్నాడని టీమ్​ఇండియా ఆటగాడు దినేశ్ కార్తీక్(Dinesh Karthik news) ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో డికాక్​పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు అతడికి మద్దతు తెలుపుతున్నారు.

సీఎస్​ఏ ఏమందంటే.?

బ్లాక్​ లివ్స్​ మ్యాటర్​కు మద్దతుగా నిలవడం ఇష్టం లేక మ్యాచ్​ నుంచి డికాక్ తప్పుకోవడాన్ని వ్యక్తిగత కారణంగా స్వీకరించింది క్రికెట్ సౌతాఫ్రికా. అయితే.. దీనికి సంబంధించి మేనేజ్​మెంట్ నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపింది.

మంగళవారం వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో సౌతాఫ్రికా విజయం సాధించింది. 143 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మర్​క్రమ్(51) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ఇదీ చదవండి:

IPL 2022 Auction: 'ప్రతి జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.