ETV Bharat / sports

భారత మహిళా క్రికెట్ మళ్లీ​ షురూ- సౌతాఫ్రికాతో సిరీస్​!

author img

By

Published : Feb 23, 2021, 11:32 PM IST

UPCA confirms India-South Africa series in Lucknow from March 7
మార్చి 7 నుంచి భారత్-సౌతాఫ్రికా సిరీస్​ ​

కరోనా అనంతరం వచ్చే నెల 7న తొలి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడనుంది భారత మహిళల జట్టు. వన్డే, టీ-20 సిరీస్​ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్​కు రానుంది. ఈ విషయాన్ని ఉత్తర్​ప్రదేశ్​ క్రికెట్​ అసోసియేషన్​ స్పష్టం చేసింది.

దాదాపు ఏడాది తర్వాత మహిళల క్రికెట్​ జట్టు మైదానంలో దిగబోతోంది. సౌతాఫ్రికాతో మార్చి 7 నుంచి స్వదేశంలో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్(వన్డే, టీ-20)లో ఆడనుంది. ఈ విషయమై బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఉత్తర్​ప్రదేశ్​ క్రికెట్​ అసోసియేషన్​(యూపీసీఏ) ధ్రువీకరించింది.

ఫిబ్రవరి 25 నాటికి ఇరు జట్లు లఖ్​​నవూ చేరుకుంటాయని యూపీసీఏ పేర్కొంది. సౌతాఫ్రికాతో 5 వన్డేలతో పాటు 3 టీ20లు ఆడనుంది భారత్​. తొలి వన్డేకు ముందు ఆరు రోజుల పాటు ప్లేయర్లు క్వారంటైన్​లో ఉండనున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో యూసుఫ్​ పఠాన్​ క్రికెట్​ అకాడమీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.