ETV Bharat / sports

ఓ ఆటగాడిగా చెబుతున్నా.. టీమ్​ఇండియాదే గెలుపు: దాదా

author img

By

Published : Nov 8, 2020, 1:24 PM IST

India
టీమ్​ఇండియా

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత జట్టు అదరగొడుతందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. కోహ్లీ నాయకత్వ లక్షణాలు, బౌలింగ్​ విభాగం ఈ పర్యటనలో ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ నాయకత్వ లక్షణాలు, బౌలింగ్​ విభాగంలో వచ్చిన మార్పులు.. ఈ సిరీస్​లో కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు పేస్​ దళం బలంగా ఉందని ప్రశంసించాడు.

"భారత పేస్​ దళం బలంగా ఉంది. గతేడాది కన్నా నవదీప్​ సైనీ బాగా మెరుగయ్యాడు. కెప్టెన్​ విరాట్​కు బౌలర్లు అశ్విన్​, బుమ్రా, సైనీ, జడేజాను ఎప్పుడెప్పుడూ ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. అతడి సారథ్య నైపుణ్యం బాగుంది. ఇదంతా బీసీసీఐ అధ్యక్షుడిగా నేను చెప్పట్లేదు, ఓ ఆటగాడిగా చెబుతున్నాను. 2003, 2018లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టుల్లో టీమ్​ఇండియా గెలిచి చరిత్ర సృష్టించింది. త్వరలో ప్రారంభమయ్యే టెస్టు​ అక్కడే జరగనుంది. కాబట్టి బాగా ఆడండి. సానుకూల ఫలితం వస్తుందని భావిస్తున్నాను"

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఐపీఎల్​ పూర్తవగానే నవంబర్‌ 11న ఆస్ట్రేలియాకు బయల్దేరుతుంది టీమ్​ఇండియా. వరుసగా 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది. ఆసీస్‌తో తొలిసారి డే/నైట్‌ టెస్టులో తలపడనుంది. డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో ఈ పోరు జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్‌ (డిసెంబరు 26-30), సిడ్నీ (2021 జనవరి 7-11), బ్రిస్బేన్‌ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.

ఇదీ చూడండి :

'భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లో ఆ జట్టే ఫేవరేట్'

కెప్టెన్ కోహ్లీ.. అందరికంటే ముందే బుడగలోకి

భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లకు వేదికలు ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.