ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​​: ఆసీస్​ చేతిలో భారత్ ఘోర పరాజయం

author img

By

Published : Mar 8, 2020, 11:55 AM IST

Updated : Mar 8, 2020, 3:53 PM IST

Ind vs Aus Women's T20 World Cup Final
టీ20 ప్రపంచకప్​ ఫైనల్

15:38 March 08

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా ఐదోసారి విజేతగా నిలిచింది. జట్టు సమష్టిగా రాణించడం వల్ల ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. కంగారూ జట్టు​ ఇచ్చిన 185 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 99 రన్స్​కే పరిమితమైంది మహిళా టీమిండియా.

షెఫాలీ నిరాశ..

భారీ ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షెఫాలీ(2) టోర్నీలో తొలిసారి నిరాశపర్చింది. స్మృతి మంధాన(11), రోడ్రిగ్స్​(0), హర్మన్​ప్రీత్​ కౌర్​(4) పేలవ ఆటతీరు ప్రదర్శించారు. దీప్తి(33), వేద(19), రిచా(18) కాసేపు పోరాడినా ఫలితం లేదు. మేగన్​ షూట్​ 4, జొనాసెన్​ 3 వికెట్లు సాధించారు.

ఆసీస్​ ఓపెనర్లు బాదేశారు..

తొలుత బ్యాటింగ్​ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత బౌలింగ్​ను చీల్చి చెండాడారు. అలీసా హేలీ 75(39 బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సర్లు), బెత్‌ మూనీ 78*(54 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. వీరద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించి భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం వహించారు. శతకం వైపు దూసుకుపోతున్న హేలీని 12వ ఓవర్‌లో రాధా యాదవ్‌ బోల్తాకొట్టించింది. ఊరించే బంతి వేయడంతో హేలి భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద వేదా కృష్ణమూర్తి చేతికి చిక్కింది. అప్పటికే భారత్​కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఆ తర్వాత కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (16) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా శిఖా పాండే బౌలింగ్‌లో దీప్తి శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగింది. అదే ఓవర్‌లో ఆష్లీ గార్డ్‌నర్‌ (2) స్టంపౌటవ్వడం వల్ల ఆసీస్‌ 156 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. చివర్లో పూనమ్‌.. రేచల్‌(4)ను బౌల్డ్‌ చేసింది. బెత్‌మూనీ చివరి వరకు క్రీజులో ఉండి ఆసీస్‌ స్కోరును 184 పరుగులకు చేర్చింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు, పూనమ్, రాధా తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

15:34 March 08

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా మహిళలు ఘోరపరాజయం పాలయ్యారు. సమష్టిగా రాణించిన ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.

15:22 March 08

భారత్ ఘోర పరాజయం

టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్ ఓటమి అంచున ఉంది. 17 ఓవర్లు పూర్తయ్యేసరిక 6 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. విజయానికి 18 బంతుల్లో 93 పరుగులు అవసరం. క్రీజులో రిచా, శిఖా పాండే ఉన్నారు.

15:02 March 08

19 పరుగులే చేసిన కృష్ణమూర్తి ఔట్

భారత్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో 19 పరుగులు చేసిన వేదా కృష్ణమూర్తి.. డెలిస్సా బౌలింగ్​ ఔటై పెవిలియన్​ బాట పట్టింది. ప్రస్తుతం 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది టీమిండియా. క్రీజులో రిచా, దీప్తి ఉన్నారు.

14:55 March 08

భారత్ 10 ఓవర్లలో 51/4

టీ20 ప్రపంచకప్​లో భారత్ మహిళా జట్టు ఓటమి దిశగా సాగుతోంది. 10 ఓవర్లు ముగిసేటప్పటికి 4 వికెట్ల నష్టానికి కేవలం 51 పరుగులే చేసింది. క్రీజులో దీప్తి, వేదా కృష్ణమూర్తి ఉన్నారు. విజయానికి ఇంకా 131 పరుగులు అవసరం. 

14:39 March 08

కెప్టెన్ హర్మన్​ ప్రీత్ క్యాచ్​ ఔట్

టీ20 ప్రపంచకప్​లో ఫైనల్లో భారత బ్యాట్స్​ఉ​మెన్, కెప్టెన్ హర్మన్​ప్రీత్ ​కౌర్ చేతులెత్తేసింది. కేవలం 4 పరుగులే చేసి ఉసూరుమనిపించింది. ప్రస్తుతం 6 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది భారత్. క్రీజులో దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఉన్నారు.

14:33 March 08

ఓపెనర్ స్మృతి మంధాన ఔట్

11 పరుగులు చేసిన భారత ఓపెనర్ స్మృతి మంధాన.. మూడో వికెట్​గా వెనుదిరిగింది. ప్రస్తుతం 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసి, కష్టాల్లో ఉంది మహిళా టీమిండియా. క్రీజులో హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ ఉన్నారు.

14:23 March 08

తానియా రిటైర్ హర్ట్.. జెమీమా డకౌట్

టీ20 ప్రపంచకప్​ ఫైనల్​ ఛేదనలో భారత్ తడబడుతోంది. మూడు ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. తానియా బంతి హెల్మెట్​కు తగిలి రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరగ్గా, క్రీజులోకి వచ్చిన జెమీమా డకౌట్ అయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ హర్మన్​ప్రీత్, స్మృతి మంధాన ఉన్నారు.

14:14 March 08

2 పరుగులకే షెఫాలీ వర్మ ఔట్

టోర్నీ మొత్తంగా అద్భుతంగా రాణించిన భారత మహిళా ఓపెనర్ షెఫాలీ వర్మ.. ఫైనల్​లో మాత్రం నిరాశపర్చింది. ఆస్ట్రేలియా జరుగుతున్న ఈ మ్యాచ్​లో కేవలం 2 పరుగులే చేసి వెనుదిరిగింది. ప్రస్తుతం ఓ ఓవర్​కు వికెట్ నష్టానికి 3 పరుగులు చేశారు టీమిండియా మహిళలు. క్రీజులో స్మృతి మంధాన, తానియా భాటియా ఉన్నారు. 

14:03 March 08

హర్మన్​ సేనకు భారీ సవాల్​

మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది.

టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఆస్ట్రేలియా జట్టుకు... ఓపెనర్లు శుభారంభం అందించారు. అలీసా హేలీ(75) విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడింది. మొత్తం 5 సిక్సర్లు, 7 ఫోర్లు సాధించింది. మరో ఓపెనర్​ బెత్​ మూనీ(78*) కెరీర్​లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకుంది. ఆఖర్లో భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన వల్ల పరుగుల ప్రవాహం తగ్గింది. లానింగ్​(16). గార్డెనర్​(2), హైనెస్​(4) తక్కువకే ఔటయ్యారు. కారే(5*) మూనీతో కలిసి నాటౌట్​గా నిలిచింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు, పూనమ్​, రాధా తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

13:53 March 08

ముగిసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​

ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రాధా వేసిన ఆఖరి ఓవర్​లో మొత్తం 8 పరుగులు లభించాయి. మూనే(78), కారే(5) అజేయంగా నిలిచారు.

20 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 184/4

13:50 March 08

ఆస్ట్రేలియా నాలుగో వికెట్​ కోల్పోయింది. పూనమ్​ వేసిన ఈ ఓవర్​లో హైనెస్​(4) పెవిలియన్​ చేరింది. క్రీజులో మూనే(76), కారే(0) అజేయంగా ఉన్నారు.

19 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 176/4

13:46 March 08

ఈ ఓవర్​లోనూ బౌండరీ

ఆస్ట్రేలియా మళ్లీ జోరు పెంచుతోంది. శిఖా వేసిన ఈ ఓవర్​లో 10 పరుగులు లభించాయి. ఇందులో ఓ ఫోర్​ ఉంది. క్రీజులో మూనే(68), హైనెస్​(3) అజేయంగా ఉంది.

18 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 167/3

13:38 March 08

ఇద్దరు ఔట్​

ఆస్ట్రేలియా వరుసగా రెండు వికెట్లు​ కోల్పోయింది. దీప్తి వేసిన ఈ ఓవర్​లో కెప్టెన్​ లానింగ్​(16), గార్డెనర్​(2) పరుగులు చేసి ఔటయ్యారు. క్రీజులో మూనే(60), హైనెస్​(1) అజేయంగా ఉంది.

17 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 157/3

13:35 March 08

రెండు ఫోర్లు..

ఆస్ట్రేలియా బ్యాటింగ్​ జోరు కొనసాగుతోంది. రాధా​ వేసిన 16వ ఓవర్​లో 12 పరుగులు లభించాయి. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. క్రీజులో మూనే(60), లానింగ్​(16) అజేయంగా ఉన్నారు.

16 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 154/1

13:32 March 08

మూనే హాఫ్​ సెంచరీ

ఆస్ట్రేలియా ఓపెనర్​ మూనే కెరీర్​లో మరో అర్ధశతకం సాధించింది. పూనమ్​ వేసిన 15వ ఓవర్​లో 7 పరుగులు లభించాయి. క్రీజులో మూనే(50), లానింగ్​(14) అజేయంగా ఉన్నారు.

15 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 142/1

13:28 March 08

రెండు ఫోర్లు

ఆస్ట్రేలియా బ్యాట్స్​వుమన్​ మళ్లీ జోరు పెంచారు. దీప్తి వేసిన 14వ ఓవర్​లో 12 పరుగులు లభించాయి. ఇందులో రెండు ఫోర్లు ఉన్నాయి. క్రీజులో మూనే(48), లానింగ్​(10) అజేయంగా ఉన్నారు.

14 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 135/1

13:24 March 08

జోరు తగ్గింది..

ఆస్ట్రేలియా జోరుకు కాస్త బ్రేక్​లు పడ్డాయి. 13వ ఓవర్​లో 6 పరుగులే లభించాయి. క్రీజులో మూనే(41), లానింగ్​(5) అజేయంగా ఉన్నారు.

13 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 123/1

13:19 March 08

కెప్టెన్​ లానింగ్​ ఇన్​..

ఆస్ట్రేలియా ఓపెనర్ హేలీ(75) విధ్వంసానికి బ్రేక్​ పడింది. రాధా  వేసిన బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్మించి లాంగ్​ఆన్​లో ఫీల్డర్​ చేతికి చిక్కింది. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి వికెట్​ కోల్పోయింది. ఈ ఓవర్​లో 3 పరుగులే లభించాయి. క్రీజులో మూనే(40), లానింగ్​(0)

12 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 117/1

13:15 March 08

వరుస సిక్సర్లు

ఆస్ట్రేలియా ఓపెనర్ హేలీ పరుగుల వరద పారిస్తోంది. కెరీర్​లో అర్ధశతకం తర్వాత మరింత చెలరేగి ఆడుతోంది. రాజేశ్వరి వేసిన ఈ ఓవర్​లో 6 బంతుల్లో 23 పరుగులు లభించాయి. ఈ ఓవర్​లో ఏకంగా 3 సిక్సర్లు నమోదయ్యాయి. హేలీ(75), మూనే(37) అజేయంగా ఉన్నారు.

11 ఓవర్లకు ఆసీస్​ స్కోరు: 114/0

13:10 March 08

హేలీ హాఫ్​ సెంచరీ

ఆస్ట్రేలియా ఓపెనర్ హేలీ పరుగుల వరద పారిస్తోంది. కెరీర్​లో మరో అర్ధశతకం పూర్తి చేసుకుంది. రాధా వేసిన ఈ ఓవర్​లో 6 బంతుల్లో 12 పరుగులు లభించాయి. ఈ ఓవర్​లోనూ ఒక ఫోర్​ కొట్టారు. హేలీ(57), మూనే(32) అజేయంగా ఉన్నారు.

పదో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 91/0

13:06 March 08

పూనమ్​ బౌలింగ్​లో బౌండరీ

ఆస్ట్రేలియా ఓపెనర్లు పవర్​ ప్లే అయిపోయినా  పరుగుల వరద పారిస్తున్నారు. తొమ్మిదో ఓవర్​ ఓవర్​ పూనమ్​ వేయగా... మొత్తం 6 బంతుల్లో 9 పరుగులు లభించాయి. ఈ ఓవర్​లోనూ ఒక ఫోర్​ కొట్టారు. హేలీ(49), మూనే(29) అజేయంగా ఉన్నారు.

తొమ్మిదో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 79/0

13:02 March 08

వరుస సిక్సర్లు..

ఆస్ట్రేలియా ఓపెనర్లు పవర్​ ప్లే అయిపోయినా  పరుగుల వరద పారిస్తున్నారు. ఎనిమిదో ఓవర్​ ఓవర్​ రాజేశ్వరి వేయగా... మొత్తం 6 బంతుల్లో 16 పరుగులు ఇచ్చుకుంది. ఈ ఓవర్​లో రెండు సిక్సర్లు లభించాయి. హేలీ(47), మూనే(23) అజేయంగా ఉన్నారు.

ఎనిమిదో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 70/0

12:58 March 08

భాగస్వామ్యం 50 దాటేసింది..

ఆస్ట్రేలియా ఓపెనర్ల జోరును అడ్డుకునేందుకు స్పిన్నర్​ పూనమ్​ రంగంలోకి దిగింది. ఏడో ఓవర్​ వేసిన​ ఈ బౌలర్​... మొత్తం 6 బంతుల్లో 5 పరుగులు ఇచ్చింది. హేలీ(32), మూనే(22) అజేయంగా ఉన్నారు.

ఏడో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 54/0

12:53 March 08

పవర్​ ప్లేలో 49 పరుగులు..

ఆస్ట్రేలియా ఓపెనర్లు మొదటి పవర్​ ప్లే ముగిసేసరికి భారీగానే పరుగులు రాబట్టారు. ఆరో ఓవర్​ రాజేశ్వరి వేయగా... మొత్తం 6 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. ఈ ఓవర్​లో మాత్రమే ఫోర్​ రాలేదు. హేలీ(30), మూనే(19) అజేయంగా ఉన్నారు.

ఆరో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 49/0

12:49 March 08

పరుగులు పిండేస్తున్నారు

ఆస్ట్రేలియా ఓపెనర్లు మొదటి పవర్​ ప్లేలో పరుగులు భారీగానే పిండుకున్నారు. ఐదో ఓవర్​ శిఖా పాండే వేయగా... మొత్తం 6 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. ఈ ఓవర్​లోనూ రెండో ఫోర్లు​ లభించాయి. హేలీ(29), మూనే(18) అజేయంగా ఉన్నారు.

ఐదో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 47/0

12:47 March 08

నాలుగో ఓవర్​లోనూ బౌండరీ

ఆస్ట్రేలియా ఓపెనర్లు భారత బౌలింగ్​ను దీటుగా ఎదుర్కొంటున్నారు. నాలుగో ఓవర్​ రాజేశ్వరి వేయగా... మొత్తం 6 బంతుల్లో 5 పరుగులే వచ్చాయి. ఈ ఓవర్​లోనూ ఫోర్​ లభించింది. హేలీ(28), మూనే(9) అజేయంగా ఉన్నారు.

నాలుగో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 37/0

12:42 March 08

మూడో ఓవర్​లోనూ బౌండరీ

ఆస్ట్రేలియా ఓపెనర్లు భారత బౌలింగ్​ను దీటుగా ఎదుర్కొంటున్నారు. మూడో ఓవర్​ దీప్తి వేయగా... మొత్తం 6 బంతుల్లో 9 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్​లోనూ ఫోర్​ లభించింది. హేలీ(28), మూనే(4) అజేయంగా ఉన్నారు.

మూడో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 32/0

12:39 March 08

రెండో ఓవర్లోనే రెండు ఫోర్లు

బ్యాటింగ్​ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు.. ధాటిగా ఇన్నింగ్స్​ మొదలుపెట్టింది. రెండో ఓవర్​లోనూ రెండు బౌండరీలు బాదిన ఆసీస్​ బ్యాట్స్​వుమన్​... మొత్తం 6 బంతుల్లో 9 పరుగులు రాబట్టారు. హేలీ(21), మూనే(2) అజేయంగా ఉన్నారు.

రెండో ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 23/0

12:30 March 08

తొలి బంతికే ఫోర్​

టాస్​ గెలిచిన ఆస్ట్రేలియా సారథి మెగ్​ లానింగ్​.. బ్యాటింగ్​ ఎంచుకుంది. ఓపెనర్లుగా హేలీ, మూనే బరిలోకి దిగారు. తొలి ఓవర్​ దీప్తి వేయగా.. తొలి బంతికే బౌండర్​ బాదేసింది కంగారూ బ్యాట్స్​వుమన్ హేలీ​. 6 బంతుల్లో మొత్తం 14 పరుగులు లభించాయి. హేలీ(13), మూనే(1) అజేయంగా ఉన్నారు.

తొలి ఓవర్​ ముగిసేసరికి స్కోరు: 14/0

12:02 March 08

మైదానంలో బరిలోకి దిగే ఇరుజట్ల వివరాలు

భారత్

హర్మన్​ప్రీత్​ కౌర్​(కెప్టెన్​), జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, శిఖా పాండే, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తానియా భాటియా (కీపర్​), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్​

ఆస్ట్రేలియా

మెగ్ లానింగ్ (కెప్టెన్), అలిసా హేలీ (కీపర్), బెత్ మూనీ, గార్డ్​నర్, రాచెల్ హైనెస్, సోఫీ మొలినెక్స్​, నికోలా కారే, జెస్ జోనాసెన్, దెలిసా కిమ్మిన్స్, మెగన్ షూట్, జార్జియా వారెహమ్​

అమీతుమీ

టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ఫైనల్‌. భారత్‌కు మొదటిది. వన్డే ప్రపంచకప్‌లో మాత్రం భారత్‌కు రెండుసార్లు ఫైనల్‌ ఆడిన అనుభవముంది.

ఆస్ట్రేలియాతో భారత్‌ 20 టీ20లు ఆడింది. 6 మ్యాచ్‌ల్లో నెగ్గి, 13 ఓడింది. ఆ జట్టుతో ఆడిన తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన భారత్‌.. తర్వాతి 12 మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గింది.

12:00 March 08

భారత్ బౌలింగ్.. ఆసీస్ బ్యాటింగ్

టీ20 మహిళా ప్రపంచకప్​ ఫైనల్​లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. మెల్​బోర్న్ వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతుంది. 

11:40 March 08

మహిళా టీ20 ప్రపంచకప్​ కప్పు అందుకునేదెవరు?

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్​ ఫైనల్​కు అంతా సిద్ధమైంది. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది. తొలిసారి కప్పు అందుకోవాలనే ఆలోచనతో బరిలోకి దిగుతోంది భారత్. హర్మన్​ప్రీత్ కౌర్ నేతృత్వంలో విజేతగా నిలవాలని భావిస్తోంది. లీగ్​దశలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం సహా ప్రత్యర్థిని మట్టికరిపించాలని ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది.

Last Updated : Mar 8, 2020, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.