ETV Bharat / sports

ఉత్కంఠగా గబ్బా టెస్టు.. గెలుపు ఎవరిదో?

author img

By

Published : Jan 18, 2021, 1:15 PM IST

Updated : Jan 18, 2021, 1:41 PM IST

వర్షం కారణంగా గబ్బా టెస్టు నాలుగో రోజు ఆట నిలిచిపోయింది. రెండో ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటై భారత్​ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్​ ఛేదన ప్రారంభించిన భారత్​.. 4/0తో నిలిచింది.

bcci
బీసీసీఐ

బ్రిస్బేన్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్టు‌కు అంతరాయం కలిగింది. నాలుగో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్​లో వరుణుడు అడ్డంకిగా మారడం వల్ల ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఫలితంగా ఇంకా 23 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించేశారు.

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్​ ఛేదన మొదలుపెట్టిన భారత్‌ నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి 4/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ (4), గిల్ ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో 294 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సిరాజ్ ఐదు, శార్దూల్ నాలుగు వికెట్లతో సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో భారత్‌కు ఆసీస్‌ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

రోహిత్​ రికార్డు..

ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఐదు క్యాచ్​లు అందుకున్న ఆటగాడిగా రోహిత్​ శర్మ రికార్డు సాధించాడు. గబ్బా టెస్టులో ఈ టీమ్​ఇండియా ఆటగాడు 5 క్యాచ్​లు పట్టాడు. అంతకుముందు సోల్కర్​, కే. శ్రీకాంత్​, రాహుల్​ ద్రావిడ్​ కూడా ఈ ఘనత సాధించారు.

ఇదీ చూడండి : ఆస్ట్రేలియా 294 ఆలౌట్​.. భారత్​ లక్ష్యం 328

Last Updated : Jan 18, 2021, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.