ETV Bharat / sports

భారత్​కు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ

author img

By

Published : Jan 10, 2021, 11:21 AM IST

సిడ్నీలో మరోసారి జాతి వివక్ష కోరలు చాచింది. శనివారమే ఈ తరహా ఘటన దృష్టికి రాగా ఆదివారం రెండో సెషన్​లో మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. దీంతో టీమ్ఇండియాను క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ కోరింది.

fresh abuse from Sydney crowd on Day 4, cricket australia apologises
మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు.. క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నాలుగో రోజున భారత క్రికెటర్లపై వీక్షకుల నుంచి కొంతమంది అల్లరి మూకలు మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని పేసర్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయగా.. రెండో సెషన్​లో ఆటకు కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పాడింది. దీంతో సదరు బృందాన్ని మైదానం విడిచి వెళ్లాల్సిందిగా భద్రతా సిబ్బంది ఆదేశించారు.

క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణ..

ఈ వ్యవహారంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇలాంటి వివక్షపూరిత వ్యవహారశైలిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని స్పష్టం చేసింది. టీమ్​ఇండియాకు బేషరతుగా క్షమాపణ చెప్పింది.

శనివారం కూడా భారత పేసర్లు బుమ్రా, సిరాజ్​లపై కొందరు ప్రేక్షకులు ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసింది భారత్.

ఇదీ చూడండి: మూడో టెస్టు: బుమ్రా, సిరాజ్​పై జాతి వివక్ష వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.