ETV Bharat / sports

Cricket In Olympics : ఒలింపిక్స్​లో క్రికెట్ అప్పటినుంచే​!.. 128 ఏళ్ల తర్వాత తొలిసారి..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 7:00 AM IST

Updated : Oct 10, 2023, 7:28 AM IST

Cricket In Olympics 2028
Cricket In Olympics 2028

Cricket In Olympics 2028 : 2028లో అమెరికాలోని లాస్​ ఎంజెలెస్​ వేదికగా జరగనున్న ఒలింపిక్​ క్రీడల్లో క్రికెట్​ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ముంబయిలో జరిగే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ- ఐఓసీ సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి.

Cricket In Olympics 2028 : క్రికెట్​ను క్రేజ్​ మరో రేంజ్​కు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా 2028 లాస్‌ఏంజెలస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ కూడా చేర్చనున్నారు. దీంతో పాటు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ను చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

IOC Meeting In Mumbai : ఈ నెల 15 నుంచి 17 వరకు ముంబయిలో ఆరంభమయ్యే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ- ఐఓసీ సమావేశంలో ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చే విషయాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయమై ఇంటర్​నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్- ఐసీసీ.. లాస్ఏంజెలెస్ ఒలింపిక్ నిర్వాహక కమిటీతో కొంత కాలంగా సంప్రదింపులు జరుపుతోంది. తాజాగా 2028 ఒలింపిక్స్​లో పలు క్రీడలతో పాటు క్రికెట్​ను కూడా చేర్చాలని సిఫార్సు ఆ కమిటీ చేసింది.

ఈ విషయంపై ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్​ బార్క్​లే స్పందించారు. ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చాలని ఎల్​ఏ28 సిఫార్సు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే ఇది తుది నిర్ణయం కానప్పటికీ.. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​లో క్రికెట్​ను​ చూడడంలో ఇదో మైలురాయి అని అన్నారు. 'ఒలింపిక్స్​లో కొత్త ఆటలు చేర్చే విషయంలో గత రెండు సంవత్సరాలుగా ఎల్​ఏ28 చాలా సపోర్ట్​ చేస్తోంది. అందుకు ఎల్​ఏ28కి కృతజ్ఞతలు. ముంబయిలో జరగనున్న ఐఓసీ సమావేశంలో తీసుకునే తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం' అని బార్క్​లే తెలపారు.

ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి..
Cricket Olympics 1900 : ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఒకే ఒక్కసారి మాత్రమే (1900 క్రీడలు, పారిస్‌) చేర్చారు. ఇందులో ఫ్రాన్స్​, గ్రేట్​ బ్రిటన్​ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్​ టీమ్​కు రజతం దక్కింది. రెండే టీమ్​లు పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకుండా పోయింది.

128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఆట మళ్లీ ఒలింపిక్స్​ ప్రేక్షకులను అలరించబోతోంది. ఇటీవలే ఆసియా క్రీడల్లో తరహాలో ఒలింపిక్స్‌లోనూ టీ20 ఫార్మాట్లో క్రికెట్‌ పోటీలు నిర్వహించే అవకాశముంది. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్​లో మహిళల క్రికెట్‌ చేరింది. తాజాగా చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో తొలిసారి క్రికెట్‌ పోటీలను నిర్వహించారు.

ఒలింపిక్స్​లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?

T20 World Cup: అమెరికాలో టీ20 ప్రపంచకప్​! ఒలింపిక్స్​ కోసమేనా?

Last Updated :Oct 10, 2023, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.