ETV Bharat / sports

చిన్నప్పటి స్కూల్లో రహానే.. జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ..

author img

By

Published : Mar 9, 2022, 10:47 PM IST

Ajinkya Rahane: తాను క్రికెట్​ నేర్చుకున్న పాఠశాలతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు భారత క్రికెటర్​ అజింక్యా రహానే. దీనికి సంబంధించిన వీడియోను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు

rahane in school
పాఠశాలలో రహానే

Ajinkya Rahane: భారత క్రికెటర్​ అజింక్యా రహానే తాను క్రికెట్​ నేర్చుకున్న పాఠశాలతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ముంబయి డోంబివ్లిలోని ఎస్​వీ జోషి హైస్కూల్​కు సంబంధించిన వీడియోను బుధవారం సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. ​

rahane in school
పాఠశాలలో రహానే
rahane in school
పాఠశాలలో రహానే

"మీ మూలాల్ని సందర్శించడం వల్ల మీరు అణకువగా ఉంటారు. డోంబివ్లి ఎంత మార్పు చెందిన నా హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది." అని పోస్ట్​ చేశాడు. రహానే తన భార్య రాధిక, కుమార్తె ఆర్యతో కలిసి తాను క్రికెట్​ నేర్చుకున్న మైదానానికి వచ్చాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకున్నాడు.

"ఇక్కడికి రావాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నాను ఈరోజు జరిగింది. ఈ మైదానం నుంచే క్రికెట్​ ఆడటం ప్రారంభించాను. స్కూల్​ నాకు చాలా అండగా నిలిచింది. స్కూల్​లో అనేక మార్పులు వచ్చాయి ఇక్కడికి రావడం నాకు ప్రత్యేకంగా అనిపించింది."

-అజింక్యా రహానే

రహానే తాజాగా జరిగిన రంజీ ట్రోఫీలో సెంచరీ చేశాడు. ఈ నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్​లో కోల్​కతాకు ఆడటానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక టెస్ట్​ సిరీస్​లో రహానేకు స్థానం లభించలేదు.

ఇదీ చదవండి: అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పిన శ్రీశాంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.