ETV Bharat / sitara

Tollywood producers meet Pawan Kalyan: పవన్​తో సినీ నిర్మాతల భేటీ... ఎవరెవరు కలిశారు? ఏం మాట్లాడారు?

author img

By

Published : Oct 1, 2021, 2:45 PM IST

Updated : Oct 1, 2021, 3:55 PM IST

tollywood-producers-meet-pawan-kalyan
tollywood-producers-meet-pawan-kalyan

14:40 October 01

పవన్‌కల్యాణ్​తో సినీ నిర్మాతలు భేటీ... చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చ

పవన్‌కల్యాణ్​తో సినీ నిర్మాతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు సినీ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ మేరకు హైదరాబాద్​లో జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్​ను ఆయన నివాసంలో (tollywood producers meet pawan kalyan)కలుసుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, నవీన్, వంశీరెడ్డి, సునీల్ నారంగ్, బన్నీవాసులు... పవన్ కల్యాణ్​తో సమావేశమై చిత్రపరిశ్రమ సమస్యలపై చర్చించారు. ఇటీవలే మంత్రి పేర్ని నానిని కలిసి జరిగిన పరిణామాలపై చర్చించిన నిర్మాతలు... పవన్ కల్యాణ్​తో కూడా సమావేశం కావడం సినీ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీసింది. 

అన్ లైన్ టికెటింగ్​, థియేటర్ వ్యవస్థతోపాటు సినిమాల విడుదలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్మాతలు పవన్​కు వివరించినట్లు తెలుస్తోంది. నిర్మాతలు సంప్రదిస్తేనే సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడినట్లు జనసేన( janasena meeting) పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వంతోపాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్​తో అగ్ర నిర్మాతలు సమావేశం కావడం (tollywood producers meet pawan kalyan)ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంపై రేపు రాజమండ్రి సభలో పవన్ ప్రస్తావించే అవకాశాలున్నట్లు సమాచారం. 

రిపబ్లిక్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ వేదికగా పవన్​ ఏమన్నారంటే..

'సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే.. వైకాపా నేతలు కాలిపోతారు.. జాగ్రత్త' అని రిపబ్లిక్​ ప్రీరిలీజ్​ ఈవెంట్​ వేదికగా పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. 'ఇది వైకాపా రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్‌..' అని వ్యాఖ్యానించారు. వైకాపా రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హితవు పలికారు. గూండాలకు భయపడితే బతకడం అసాధ్యమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైకాపా ప్రభుత్వం తీరు మారాలన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని మార్చేందుకు ఏం చేయాలో తమకు తెలుసన్న పవన్‌... 'తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు.. ఆపలేరు' అని స్పష్టం చేశారు.

సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవని పవన్ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయని, సినీ పరిశ్రమ జోలికి వస్తే సినీ నటులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వానికే విలువ ఇస్తానని పవన్‌ స్పష్టం చేశారు. సినిమావాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదని, ప్రేక్షకులను అలరిస్తూ కష్టపడుతున్నారన్నారు. తనతో గొడవ ఉంటే తన సినిమాలు ఆపేయాలని, అంతే గానీ మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరారు. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. తమలో ఉన్న అభిప్రాయ భేదాలను శత్రుత్వంగా భావించడం సరికాదని హితవు పలికారు.

డబ్బు లేదు కాబట్టే టిక్కెట్లు అమ్మే ఆలోచన...

సినిమావాళ్ల కష్టాలపై మోహన్‌బాబు మాట్లాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమ గురించి వైకాపా నేతలకు చెప్పాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు రేపు మోహన్‌బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన చేస్తోందని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు పొందేందుకు ప్రణాళికలు చేస్తోందని మండిపడ్డారు. సినిమావాళ్లు పన్నులు కడుతున్నారు.. ధైర్యంగా మాట్లాడాలని పవన్‌ సూచించారు. 

సంబంధిత కథనాలు..

Last Updated :Oct 1, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.