ETV Bharat / sitara

10 తర్వాత చూసుకుందాం పవన్​..విష్ణుకు ఓటేయ్: మోహన్​బాబు

author img

By

Published : Sep 26, 2021, 4:28 PM IST

Updated : Sep 26, 2021, 4:48 PM IST

'రిపబ్లిక్​' ప్రీరిలీజ్​ ఈవెంట్​లో(Republic pre release event) పవన్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్​ నటుడు మోహన్​బాబు(pawan kalyan mohan babu fight) కౌంటర్​ వేశారు. 'మా' ఎన్నికల తర్వాత ఆ ​ వ్యాఖ్యలకు జవాబిస్తానని అన్నారు. ఈ ఎలక్షన్స్​లో విష్ణు ప్యానెల్‌కు ఓటేసి గెలిపించాలని పవన్​ను సూచించారు.

pawan
పవన్​

పవన్(pawan kalyan vs mohan babu) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోహన్​బాబు.. మా ఎన్నికల్లో తమ కుమారుడికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఆ తర్వాత మాట్లాడతానని చెప్పారు.పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు మోహన్​బాబు(mohan babu pawan kalyan) స్పందించారు. వయసులో తన కంటే చిన్నవాడని ఏకవచనంతో సంబోధించానని అన్నారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌.. సంతోషమే ఓ నోట్ విడుదల చేశారు.'మా' ఎన్నికల(MAA elections 2021) తర్వాత మీ ప్రశ్నలకు జవాబిస్తానని పవన్​ వ్యాఖ్యలకు బదులిచ్చారు. 'మా' ఎన్నికల్లో మీరు విష్ణు ప్యానెల్‌కు(Maa elections vishnu panel) ఓటేసి గెలిపించాలి అన్నారు.

pawankalyan
పవన్​కల్యాణ్​కు మోహన్​బాబు సెట్టైర్​

"నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్‌గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు 'మా' ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా."

-మోహన్​బాబు ట్వీట్‌

అసలు పవన్‌కల్యాణ్‌ ఏమన్నారంటే?

సెప్టెంబరు 25న సాయిధరమ్​ తేజ్(sai dharam tej republic movie) హీరోగా నటించిన 'రిపబ్లిక్'(republic movie pre release event) చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పవన్​ హాజరయ్యారు. ఈ క్రమంలోనే చిత్రపరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సినిమావాళ్ల కష్టాలపై మోహన్‌బాబు మాట్లాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమ గురించి వైకాపా నేతలకు చెప్పాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు రేపు మోహన్‌బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన చేస్తోందని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు పొందేందుకు ప్రణాళికలు చేస్తోందని మండిపడ్డారు. సినిమావాళ్లు పన్నులు కడుతున్నారు.. ధైర్యంగా మాట్లాడాలని పవన్‌ సూచించారు.

ఇదీ చూడండి: PAWAN KALYAN: చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. వైకాపా నేతలకు పవన్ వార్నింగ్

Last Updated : Sep 26, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.