ETV Bharat / sitara

మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టిన శిల్పాశెట్టి

author img

By

Published : Aug 19, 2021, 8:00 PM IST

పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్​, మరోవైపు ఫిట్​నెస్​ సెంటర్​ విషయంలో తనపై చీటింగ్​ కేసు నమోదు.. ఇలా వరుస సమ్యసలతో కొద్దిరోజులుగా సతమతమవుతోంది బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. ఈ నేపథ్యంలో చిత్రీకరణలకు దూరమైన ఆమె.. మళ్లీ సెట్స్​లోకి అడుగుపెట్టింది. వైరల్​గా మారిన ఆ వీడియోను మీరు చూసేయండి.

shilpa
శిల్పా

బాలీవుడ్‌ ప్రముఖ నటి శిల్పాశెట్టి మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ కావడం, మరోవైపు ఫిట్‌నెస్‌ సెంటర్‌ విషయంలో ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడినందుకు తనపై, ఆమె తల్లి సునంద శెట్టిపై కేసు నమోదవడం వల్ల శిల్పా వ్యక్తిగతంగా సతమతమైంది.

దాంతో 'సూపర్‌ డ్యాన్సర్‌' రియాలిటీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోన్న శిల్ప కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ ఆ షోలో సందడి చేయనున్నారామె. న్యాయనిర్ణేతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించేందుకు మళ్లీ ఆ కార్యక్రమ సెట్స్‌లో అడుగుపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఉంచగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. శిల్పతోపాటు కొరియోగ్రాఫర్‌ గీతాకపూర్‌, దర్శకుడు అనురాగ్‌ బసు ఉన్నారు.

ఇదీ చూడండి: దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు: శిల్పాశెట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.