ETV Bharat / sitara

షాహిద్, విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో వెబ్ సిరీస్!

author img

By

Published : Dec 20, 2020, 11:32 AM IST

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ త్వరలోనే వెబ్​సిరీస్​లో నటించనున్నారు. 'ఫ్యామిలీమ్యాన్' ఫేమ్ రాజ్, డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సిరీస్​లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా కనిపించనున్నారు.

Shahid Kapoor, Vijay Sethupati to mark OTT debut together?
షాహిద్, విజయ్ సేతుపతి ప్రధానపాత్రల్లో వెబ్ సిరీస్!

స్టార్ హీరోలు కూడా ఓటీటీల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అమెజాన్ ప్రైమ్​లో ఓ సిరీస్​ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. 'ఫ్యామిలీమ్యాన్' ఫేమ్ రాజ్, డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కనుంది. దీని ద్వారా తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా డిజిటల్ ప్లాట్​ఫామ్​పై అరంగేట్రం చేయనున్నారని సమాచారం.

'కబీర్​సింగ్​'తో బాలీవుడ్ బాక్సాఫీస్​ను షేక్ చేసిన షాహిద్ ఇటీవలే 'జెర్సీ' షూటింగ్​ను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్​లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందనున్న ఈ సిరీస్​ త్వరలోనే పట్టాలెక్కనుందట. ముంబయి, గోవాల్లో షూటింగ్ చేయనున్నారని బాలీవుడ్ టాక్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.