సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అత్యంత సన్నిహితుడైన మోహన్ బాబు.. రజనీ యోగక్షేమాలను తెలుసుకున్నారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం తిరుపతిలో ఉన్న మోహన్‌బాబు.. రజనీ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన యోగక్షేమాలను తెలుసుకునేందుకు రజనీ భార్య లత, కుమార్తె ఐశ్వర్యలకు ఫోను చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెప్పడం వల్ల మోహన్ బాబు కుదుటపడ్డారు.
![mohan babu inquiry about rajinikanth health information](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10009147_1.jpg)
రజనీకాంత్.. మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అని, ఆయన త్వరగా కోలుకుని, ఎప్పటిలాగే తన పనులు మొదలు పెడతారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రజినీకాంత్‌కు అస్వస్థత.. జూబ్లీహిల్స్ అపోలోలో చేరిన సూపర్ స్టార్