ETV Bharat / sitara

టైసన్​తో మాట్లాడాలంటే భయమేసింది: అనన్య

author img

By

Published : Dec 27, 2021, 12:50 PM IST

Liger
లైగర్

విజయ్​ దేవరకొండ నటిస్తున్న 'లైగర్'​ చిత్రంలో కీలక పాత్రలో కనిపించి భారత ప్రేక్షకులకు మరింత దగ్గరకానున్నారు లెజెండరీ బాక్సర్ మైక్​ టైసన్. ఆయనను ఒక్కసారైనా కలిసి మాట్లాడాలని ఎందరో అభిమానులు కోరుకుంటారు. అయితే 'లైగర్​' బ్యూటీ అనన్యా పాండే మాత్రం.. టైసన్​తో మాట కలపాలంటే భయమేసేదని చెబుతోంది.

భారత నటీనటులు హాలీవుడ్​లో నటించడమే కాదు.. ఇంగ్లీష్ నటులూ మన సినిమాల్లో సందడి చేస్తుంటారు. స్టార్​ హీరోలైన విల్​ స్మిత్, సిల్వెస్టర్​ స్టాలోన్ వంటి నటులు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇక లెజెండరీ బాక్సర్​ మైక్ టైసన్ మాత్రం మన సినిమాలకు కొత్తే! పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్'​ చిత్రంలో టైసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే అమెరికాలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్​ పూర్తి చేసుకున్నారు.

Liger
'లైగర్'​లో టైసన్​ లుక్

తాజాగా టైసన్​ గురించి ఆసక్తికర విశేషం చెప్పింది అనన్యా. టైసన్​తో మాట్లాడాలంటే భయమేసిందట. ఆయనతో మాట కలిపేందుకు వణికిపోయేదాన్నని చెబుతోంది అనన్య.

Liger heroine
అనన్య పాండే

"మైక్ టైసన్ చాలా గొప్ప వ్యక్తి. నిజం చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వాన్ని, బాక్సింగ్​ ప్రతిభను చూసి ఆయనతో మాట్లాడాలంటే కొద్దిగా భయమేసేది. చిన్నప్పటి నుంచి ఆయన బౌట్​లు చూస్తూ పెరిగాం. ఎంతో పేరున్న వ్యక్తి అయినప్పటికీ ఆయన చాలా ఫన్నీగా, కూల్​గా ఉంటారు."

- అనన్యా పాండే, నటి

పా​న్‌ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా 'లైగర్​' మూవీని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదలకానుంది. ఈ ఏడాది డిసెంబరు 31న చిత్రానికి సంబంధించిన ఓ గ్లింప్స్​ను రిలీజ్​ చేయబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.

Liger
'లైగర్'​ చిత్రబృందం

ఇదీ చూడండి: Priyanka Chopra: 'ఈ స్థాయికి రావడానికి కారణం అదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.