ETV Bharat / sitara

Priyanka Chopra: 'ఈ స్థాయికి రావడానికి కారణం అదే'

author img

By

Published : Dec 27, 2021, 7:09 AM IST

Priyanka Chopra: దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్నా.. ఇప్పటికీ వన్నె తరగని అందం, అభినయంతో అలరిస్తోంది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. తను ఆ స్థాయిలో ఉండటానికి కారణం తన నిర్ణయాలే అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

Priyanka Chopra
ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ఏళ్ల తరబడి చిత్రసీమలో సత్తా చాటే నాయికల సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటి నాయికల జాబితాలో ప్రియాంక చోప్రా కచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టి 18 ఏళ్లు గడిచిపోయాయి. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, జాతీయ పురస్కారాలు అందుకుందామె. తన జీవితంలో కీలకమైన అడుగు హాలీవుడ్‌. అక్కడా వరసగా సినిమాల్లో నటిస్తూ అంతర్జాతీయంగానూ సత్తా చాటుతోంది.

Priyanka Chopra
ప్రియాంక చోప్రా

"ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా నిర్ణయాలే. ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఇంకా నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. ఇప్పటివరకూ ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఏదీ అంత సులువుగా అయితే రాలేదు"అని చెబుతోంది ప్రియాంక.

ఇదీ చూడండి: Priyanka chopra: 'స్టార్​డమ్​ పక్కనపెట్టి.. అవకాశాల కోసం అలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.