ETV Bharat / sitara

అభిమాని లేఖకు నిఖిల్​ ఫిదా.. రిటర్న్​ గిఫ్ట్​గా..

author img

By

Published : Dec 10, 2020, 10:46 PM IST

టాలీవుడ్​ హీరో నిఖిల్​.. ఓ ఫ్యాన్​గర్ల్​ రాసిన లేఖకు ఫిదా అయ్యారు. ఈ లేఖలో తనపై అభిమానాన్ని వ్యక్త పరిచిన ఆమె కోసం తన ఆటోగ్రాఫ్​తో ఉన్న బ్లాక్​ జాకెట్​ను పంపనున్నట్లు తెలిపారు. ఇదే విధంగా ప్రతి వారం సోషల్​మీడియా ద్వారా ఓ అభిమానిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తానని వెల్లడించారు.

Hero Nikhil sends a special gift to his fangirl
అభిమాని లేఖకు నిఖిల్​ ఫిదా.. రిటర్న్​ గిఫ్ట్​గా జాకెట్​​

అభిమాని రాసిన లేఖకు ఫిదా అయ్యారు టాలీవుడ్​ యంగ్​హీరో నిఖిల్​. శ్రీదేవి అనే అభిమాని తనకు రాసిన లేఖ తనకు ఎంతోగానో నచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ఓ బ్లాక్​ జాకెట్​ కానుకగా పంపనున్నట్లు నిఖిల్ తెలియజేశారు.

ఇదే విధంగా ప్రతి వారం సోషల్​మీడియాలో తనపై అభిమానం చూపుతున్న వారికి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. నిఖిల్.. ప్రస్తుతం '18 పేజీస్​' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్​ హీరోయిన్​గా నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.