ETV Bharat / sitara

'రాధేశ్యామ్' రిలీజ్.. నాలుగేళ్ల క్రితమే చెప్పిన ఆ జ్యోతిషుడు

author img

By

Published : Dec 25, 2021, 8:02 PM IST

Updated : Dec 25, 2021, 8:47 PM IST

radhe shyam movie
ప్రభాస్ రాధేశ్యామ్

Radhe shyam release date: ప్రభాస్ 'రాధేశ్యామ్' రిలీజ్​ గురించి ఓ ప్రముఖ జ్యోతిషుడు ముందే చెప్పేశారు. ఆ విషయాన్ని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది?

Prabhas radhe shyam: డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా నిర్వహించారు. ఇప్పుడు హైదరాబాద్​లో శనివారం ప్రెస్​మీట్​ పెట్టి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ డేట్​ గురించి నాలుగేళ్ల క్రితమే ఓ జ్యోతిషుడు చెప్పారని డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెలిపారు.

director radha krishna kumar
డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్

''రాధేశ్యామ్' రీసెర్చ్​లో భాగంగా ఓ జ్యోతిష్యుడిని కలిశాను. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాను. అయితే ఈ సినిమా 2022 ప్రథమార్ధంలో రిలీజ్​ అవుతుందని ఆయన అప్పుడే చెప్పారు. అయితే నేను ఆ సమయంలో అది నమ్మలేదు" అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చెప్పారు.

'రాధేశ్యామ్' వీఎఫ్​ఎక్స్ వర్క్ 12 దేశాల్లో చేశామని రాధాకృష్ణ వెల్లడించారు. ఫిలాసఫీ అనే నేపథ్యంగా తీసిన ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. డైరెక్టర్​గా కాకుండా ప్రభాస్​ అభిమానిగా గర్వంగా చెబుతున్నా.. ఈ సినిమా అభిమానుల అంచనాలను మించి ఉంటుందని రాధాకృష్ణ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని, లవ్ అర్థమైన ప్రతి ఒక్కరి కోసమే ఈ చిత్రమని చెప్పారు.

prabhas
ప్రభాస్

1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా రేంజ్​లో ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated :Dec 25, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.