ETV Bharat / sitara

తొలి దక్షిణాది హీరోగా రామ్​ రికార్డు.. సామ్​ పోస్ట్ వైరల్​​!

author img

By

Published : Feb 26, 2022, 1:38 PM IST

Updated : Feb 26, 2022, 2:25 PM IST

ram pothineni
రామ్ పోతినేని

వరుస సినిమాలతో కెరీర్​లో దూసుకెళ్తోన్న హీరో రామ్​ పోతినేని.. యూట్యూబ్​లో అరుదైన రికార్డు సాధించిన తొలి దక్షిణాది హీరోగా నిలిచారు. కాగా, హీరోయిన్​ సమంత చేసిన ఓ పోస్ట్​ ప్రస్తుతం వైరల్​గా మారింది.

గత కొద్ది కాలంగా తెలుగు చిత్రాలకు యూట్యూబ్​లో బాగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మన సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్, బెల్లంకొండ శ్రీనివాస్​​ నటించిన సినిమాలు రికార్డు వ్యూస్​తో దూసుకెళ్తుండగా..వాటిని వెనక్కినెట్టి రామ్​ పోతినేని చిత్రాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆయన నటించిన అన్ని మూవీస్​ కలిపి యూట్యూబ్​లో 200కోట్లకు పైగా వ్యూస్​ను దక్కించుకున్నాయి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది హీరోగా రామ్​ నిలిచారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో 'ద వారియర్'​ చిత్రంలో నటిస్తున్నారు.

ram potineni
రామ్​ రికార్డు

సమంత పోస్ట్​

అగ్రకథానాయిక సమంతను తెలుగు తెరకు పరిచయం చేసిన రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం ‘ఏమాయ చేసావె’. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సామ్‌ నటిగా తెరంగ్రేటం చేశారు. ఈ ఫీల్‌గుడ్‌ మూవీ విడుదలై శనివారంతో 12 సంవత్సరాలైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ సమంత తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ఇన్ని సంవత్సరాలుగా తనని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. "చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటితో 12 సంవత్సరాలైంది. లైట్స్‌, కెమెరా, యాక్షన్‌.. వీటి చుట్టూ నాకున్న మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల గొప్ప ప్రయాణం, ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. కెమెరాతో నా ప్రేమకథ ఇలాగే ఎంతోకాలం కొనసాగాలని కోరుకుంటున్నా" అని సమంత పోస్ట్‌ పెట్టారు. ఈ సినిమా కోసమే నాగచైతన్య-సమంత మొదటిసారి కలిసి పనిచేసింది. ఈ సినిమా షూట్‌లోనే వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. గతేడాది వాళ్లిద్దరూ తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ చెప్పిన క్రమంలో సమంత.. తన తొలి చిత్రం గురించి పోస్ట్‌ పెట్టడం వల్ల.. ఇప్పుడు ఇది కాస్త వైరల్‌గా మారింది.

samantha post
సమంత పోస్ట్​

ఇదీ చదవండి: పునీత్​ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు టాలీవుడ్​ స్టార్స్​!

Last Updated :Feb 26, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.