ETV Bharat / health

బరువు తగ్గాలని ఎక్సర్​సైజ్​లు చేస్తున్నారా? అయినా ఫలితం లేదా? ఈ చిన్నతప్పే కారణమంటున్న నిపుణులు! - Side Effects of Prolonged Sitting

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 12:00 PM IST

Prolonged Sitting Effects: "డైలీ ఎక్సర్​సైజ్​ చేస్తున్నాం.. అయినా బరువు తగ్గటం లేదు. హైబీపీ, షుగర్​ వంటి సమస్యలతో బాధపడుతున్నాం" ప్రస్తుతం చాలా మంది నోటి నుంచి వినిపించే మాటే ఇది. అయితే ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా ఈ సమస్యలు వస్తున్నాయంటే దానికి కారణం మీరు చేసే ఈ చిన్న పొరపాటే అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Prolonged Sitting Effects
Prolonged Sitting Effects (ETV Bharat)

Side Effects of Prolonged Sitting: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వెయిట్​ లాస్​ అవ్వడానికి డైలీ ఎక్సర్​సైజ్​, డైట్​లు ఫాలో అవుతుంటారు. అయినా బరువు తగ్గడము అనేది జరగదు. అయితే చాలా మందికి "డైలీ ఎక్సర్​సైజ్​ చేస్తున్నా బరువు తగ్గడం లేదని.. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి" అనే డౌట్​లు వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు తగ్గటానికి వ్యాయామం సరైనదనే మాట నిజమే అయినా ఇదొక్కటే సరిపోదని.. ఈ తప్పు లేకుండా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆరోగ్యంగా ఉండాలని ఎన్ని వ్యాయామాలు చేస్తున్నా.. రోజుకు 8 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నట్టయితే వ్యాయామంతో కలిగే ప్రయోజనాలు దూరమైనట్టే అని నిపుణులు అంటున్నారు. కాబట్టి గంటకోసారైనా కుర్చీలోంచి లేచి కాసేపు అటూ ఇటూ నడవటం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీలుంటే కాస్త వేగంగా పరుగెత్తినా మంచిదే అంటున్నారు. ఈక్రమంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం: ఎక్కువ సేపు కూర్చొవడం వల్ల అనేక హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. ఇదే విషయం పరిశోధనాత్మకంగా రుజువైందని చెబుతున్నారు. 2020లో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఈ విషయాన్ని తన పరిశోధనల్లో నిరూపించిందని అంటున్నారు. ఈ పరిశోధన ప్రకారం ప్రతిరోజూ 5 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 14% ఎక్కువని, ప్రతిరోజూ 6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 24% ఎక్కువ ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ సుజాన్న్ హోస్ పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా కూర్చోవడం గుండె ఆరోగ్యానికి హానికరమని వారు పేర్కొన్నారు.

తొందరగా వృద్ధాప్య ఛాయలు: గంటల తరబడి ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కూర్చోవడం వల్ల శరీరం క్షీణించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఆ కారణంగా చర్మం బిగుతుగా మారిపోయి, సహజత్వం కోల్పోయి తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు.

అలర్ట్ : గాల్​ బ్లాడర్​లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? - త్వరగా గుర్తించకపోతే ఏమవుతుంది? - why does gallbladder get stones

మెదడు మొద్దు బారిపోతుంది: ఎక్కువగా కూర్చోవడం వల్లన మెదడు నిర్మాణం, శారీరక కదలికలకి సందేశం పంపే అవకాశం లేక మెదడు మొద్దుబారిపోతుందని అంటున్నారు. దానీవల్ల అల్జీమర్స్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ: కూర్చునే సమయంలో తక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయి. దీనివల్ల శరీరంలోని వివిధ క్రియలు అదే తరహాలో జరుగుతాయి. ఎక్కువ సేపు కూర్చుని లేచిన తరువాత శారీరక క్రియలు వేగం అందుకుంటాయి. దానివల్ల శరీరంలో ఇన్సులిన్‌ల పట్ల ప్రతిచర్య ఏర్పడుతుందనేది పరిశోధకుల వాదన. డీప్‌వైన్‌ థ్రాంబోసిస్‌, రక్తం గడ్డకట్టడం, తిమ్మిర్లు, కొవ్వు శాతం పెరిగిపోవడం, జీర్ణశక్తి లోపించడం వంటి ప్రమాదాలకు కారణమవుతుందని అంటున్నారు. ఈ కారణంగా డయాబెటిస్​, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. వీటన్నింటిని అధిగమించాలంటే పని గంటల్లో తప్పనిసరిగా లేచి అటు ఇటు నడవాలని.. లిప్ట్‌లకు, ఎస్కలేటర్‌లకు ప్రాధాన్యత ఇవ్వకుండా నడవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

కండరాల నొప్పులు: దీర్ఘకాలికంగా కూర్చోవడం వల్ల వెన్నుముక నొప్పి, మెడ నొప్పి, ఇతర కండరాల నొప్పులు రావచ్చని.. ఇది కీళ్ల స్థిరత్వాన్ని కూడా దెబ్బతీస్తుందని చెబుతున్నారు.

క్యాన్సర్: కొన్ని అధ్యయనాలు దీర్ఘకాలికంగా కూర్చోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరగుతుందని స్పష్టం చేశాయి. 2010లో "Cancer Epidemiology, Biomarkers & Prevention" జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21% ఎక్కువని, రోజుకు 6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వ్యక్తులకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 12% ఎక్కువని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లో ప్రొఫెసర్ డాక్టర్​ లారెన్స్ డోనాల్డ్సన్​ పాల్గొన్నారు.

తల్లిదండ్రులకు మూర్ఛ వ్యాధి ఉంటే పిల్లలకూ వస్తుందా? - నిపుణుల సమాధానమిదే! - Epilepsy Causes

తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవండి - మీ శరీరంలో ఊహించలేని మార్పు! - Benefits of Walking after Meals

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.