ETV Bharat / science-and-technology

వాట్సాప్​ మన మాటలు​ రికార్డ్ చేస్తోందని అనుమానమా?.. ఇలా చెక్ చేసుకోండి

author img

By

Published : May 14, 2023, 1:24 PM IST

whatsapp-privacy-breach-how-to-check-whatsapp-microphone-usage
వాట్సాప్ మైక్రోఫోన్ వినియోగాన్ని ఎలా తనిఖీ చేయాలి

Whatsapp Privacy Breach : వాట్సాప్ వినియోగదారుల స్మార్ట్​ఫోన్​లో బ్యాక్​గ్రౌండ్​లో మైక్రోఫోన్​ వినియోగిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మీ మొబైల్​ కూడా ఆ జాబితాలో ఉందో లేదో అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్​​ ఫాలో అవ్వండి.

Whatsapp Privacy Breach : స్మార్ట్​ఫోన్​ ఉపయోగించని సమయంలోనూ వాట్సాప్​.. మైక్రోఫోన్​ను ఉపయోగిస్తోందన్న ఆరోపణలు కొద్ది రోజుల క్రితం నెట్టింట కలకలం రేపాయి. ఇవి వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందన్న ఆందోళనలకు సైతం దారితీశాయి. ట్విట్టర్​లో ఇంజినీరింగ్ డైరెక్టర్​గా పని చేసే ఫోవద్​ దబిరి దీనిపై ఓ ట్వీట్ కూడా చేశారు. మన మాటల్ని వాట్సాప్​ రహస్యంగా రికార్డు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాను నిద్రపోతున్న సమయంలోనూ.. తన స్మార్ట్​ఫోన్​లోని మైక్రోఫోన్​ను వాట్సాప్​ ఉపయోగించిందని చెప్పారు. ఆ తర్వాత తాను నిద్రలేచి స్మార్ట్​ఫోన్​ వాడడం మొదలుపెట్టాక.. మైక్రోఫోన్​ పని చేస్తూనే ఉందని తెలిపారు.

ఇలా ఒక రోజు ఉదయం 4.20 నుంచి 6.53 మధ్య మైక్రోఫోన్​ను వాట్సాప్ 9 సార్లు ఆన్ చేసిందని వివరించారు. ఇందుకు సంబంధించిన ఆధారాల్ని ట్విట్టర్​లో షేర్ చేశారు ఫోవద్ దబిరి. అసలు ఏం జరుగుతోందని వాట్సాప్​ను ప్రశ్నించారు. ఇలాంటి సమయాల్లో వాట్సాప్​ వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ తరహా సమస్యలను నిర్మూలించేందుకు గూగుల్ ఆండ్రాయిడ్​ 12 వెర్షన్​లో ​ఓ ప్రైవసీ డ్యాష్​బోర్డును తీసుకువచ్చింది. దీంతో యాప్‌లకు అందించిన అన్ని అనుమతులను.. టైం ఇంకా డేట్​తో పాటు వినియోగ కాలక్రమాన్ని సైతం యూజర్​ ట్రాక్ చేసేందుకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్​ వినియోగదారులకు అనుమతిస్తుంది.

వాట్సాప్ వినియోగదారుల స్మార్ట్​ఫోన్​లో బ్యాక్​గ్రౌండ్​ మైక్రోఫోన్​ వినియోగిస్తుందా లేదా అన్న విషయాన్ని తనిఖీ చేసే ముందు ఒకసారి మీ స్మార్ట్​ఫోన్​ను చెక్​ చేసుకోవాలి. మీ మొబైల్​ కుడి పైభాగాన యాదృచ్ఛికంగా ఆకుపచ్చ సూచికను గమనించినట్లయితే.. ఓ సారి చెక్​ చేసుకోవడం మరి మంచిది. మీ మొబైల్​లో కెమెరా లేదంటే మైక్రోఫోన్‌ని ఉపయోగించే కొన్ని యాప్‌లు ఉన్నాయని ఇది సూచిస్తుంది. మీ విషయంలో ఇది జరిగినట్లయితే అదనపు శ్రద్ధ వహించాలి.

How to Check Whatsapp Microphone Usage : వాట్సాప్​ మన బ్యాక్​గ్రౌండ్​లో మైక్రోఫోన్​ వినియోగిస్తుందో లేదో ఇలా చెక్​ చేసుకోవాలి. ​

  • మొదట మీ ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లో సెట్టింగ్స్​లోకి వెళ్లండి. అనంతరం ప్రైవసీ అండ్​ సెక్యూరిటీ ఆప్షన్​పై నొక్కండి.
  • తరువాత కిందికి స్క్రోల్ చేసి ప్రైవసీ ఆప్షన్​పై క్లిక్ చేయండి
  • అనంతరం మైక్రోఫోన్‌ను ఉపయోగించిన అన్ని యాప్‌ల పూర్తి కాలక్రమాన్ని తనిఖీ చేసేందుకు మైక్రోఫోన్ సింబల్​పై నొక్కండి.
  • వెంటనే వివిధ యాప్​లు ఉపయోగించిన మైక్రోఫోన్ స్టేటస్​లు మనకు కన్పిస్తాయి. అందులో వాట్సాప్ మైక్రోఫోన్​ను​ వినియోగిస్తోందని చూపిస్తే.. మీ మాటలను వాట్సాప్ రికార్డ్ చేస్తుందని భావించాలి. ఒకవేళ అలా కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. ​

బ్యాక్​గ్రౌండ్ మైక్రోఫోన్​ను వాట్సాప్​ వినియోగిస్తుంటే ఏం చేయాలి?
ఈ సందర్భంలో మొదటగా వాట్సాప్​ నుంచి మైక్రోఫోన్ యాక్సెస్‌ను నిలిపివేయాలి. ఇందుకోసం యాప్‌ల సెక్షన్​ నుంచి వాట్సాప్​నకు వెళ్లాలి. అనంతరం మైక్రోఫోన్ యాక్సెస్‌ను నిలిపివేయాలి.
వినియోగదారుల స్మార్ట్​ఫోన్​లో బ్యాక్​గ్రౌండ్​ మైక్రోఫోన్ వాట్సాప్​ వినియోగిస్తుందా లేదా అనేది తనిఖీ చేయాలనుకుంటే.. మీ ఆండ్రాయిడ్​ స్మార్ట్‌ఫోన్ రన్నింగ్ వెర్షన్ 12 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. దాంతోపాటు మైక్రోఫోన్ యాక్సెస్‌తో యాక్టివ్​ వాట్సాప్​ ఖాతా కలిగి ఉండాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.