ETV Bharat / science-and-technology

WhatsApp New Features : ఇకపై వాట్సాప్​లో మీ ఫోన్ నంబర్ కనిపించదు!.. లేటెస్ట్​ అప్​డేట్​!

author img

By

Published : Jul 11, 2023, 12:47 PM IST

whatsapp Phone Number Privacy Feature
WhatsApp new features

WhatsApp Latest Features : వాట్సాప్​ తన యూజర్ల గోప్యత కోసం 'ఫోన్​ నంబర్ ప్రైవసీ' అనే సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. అలాగే ఇకపై క్యూఆర్​ కోడ్ స్కాన్​ చేయాల్సిన అవసరం లేకుండానే.. వాట్సాప్​ వెబ్​లోకి మీ ఫోన్​ నంబర్​ ద్వారా లాగిన్ అయ్యే విధంగా అప్​డేట్​ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు మీ కోసం..

WhatsApp New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్​ మీ కాంటాక్ట్​ లిస్ట్​లో ఉన్నవారు తప్ప, వాట్సాప్​ కమ్యూనిటీలోని మరెవ్వరూ మీ ఫోన్​ నంబర్​ను చూడకుండా నిరోధిస్తుంది. ఇది మీ ప్రైవసీకి ఎలాంటి భంగం ఏర్పడకుండా కాపాడుతుందని కంపెనీ చెబుతోంది.​​ ఐఓస్​, ఆండ్రాయిడ్​ అప్​డేటెడ్​ వెర్షన్స్​లో ఈ సేఫ్టీ ఫీచర్​ అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా టెస్టర్లు దీనిని వాడొచ్చు.

రియాక్షన్ ఇచ్చినా..!
WhatsApp Phone Number Privacy Feature : వాబీటాఇన్ఫో ప్రకారం, వాట్సాప్​ 'ఫోన్​ నంబర్​ ప్రైవసీ' పేరుతో ఈ సరికొత్త ప్రైవసీ ఫీచర్​ తీసుకొచ్చింది. ఇది మీ కాంటాక్ట్ లిస్ట్​లో ఉన్న మెంబర్స్​కు తప్ప.. కమ్యూనిటిలోని ఇతరులు ఎవ్వరూ మీ ఫోన్​ నంబర్​ చూడకుండా గోప్యంగా ఉంచుతుంది. ఒక వేళ మీరు అవతలివారి మెసేజ్​కు రియాక్షన్ ఇచ్చినా కూడా మీ ఫోన్​ నంబర్​ వాళ్లకు కనిపించదు.

లేటెస్ట్ వాట్సాప్​ వెర్షన్​ను​ అప్​డేట్​ చేసుకున్న తరువాత, యూజర్లకు ఈ 'ఫోన్ నంబర్ ప్రైవసీ' గురించి అలర్ట్​ వస్తుంది. మీ ఫోన్​ నంబర్​ కేవలం కమ్యూనిటీ అడ్మిన్స్​కు, మీ కాంటాక్ట్ లిస్ట్​లో ఉన్నవారికి మాత్రమే ​కనిపిస్తుందని స్పష్టం చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కమ్యునిటీ మెంబర్స్ అందరికీ మీ ఫోన్ నంబర్ కనిపించకపోయినా.. కమ్యూనిటీ అడ్మిన్స్​కు మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది. భవిష్యత్​లో ఈ ప్రైవసీ ఫీచర్​ కేవలం కమ్యూనిటీ గ్రూపులకు మాత్రమే కాకుండా, ఇతర గ్రూపులకు కూడా వాట్సాప్​ అందుబాటులోకి తీసుకురానుంది.

  • WhatsApp is rolling out a phone number privacy feature for communities!

    After an initial test with a limited number of users, WhatsApp is widely rolling out the phone number privacy feature, with the ability to react to messages shared in the community!https://t.co/8TFeaPKgfW pic.twitter.com/w1ujISgKud

    — WABetaInfo (@WABetaInfo) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రిక్వెస్ట్​ చేస్తే..
Phone Number Privacy Feature in WhatsApp : వాట్సాప్​ కమ్యూనిటీలోని ఎవరి ఫోన్ నంబర్ అయినా​ మీరు చూడాలని అనుకుంటే.. దానికి కూడా ఒక ఆప్షన్​ ఉంది. ఇందు కోసం మీరు ముందుగా ఓ రిక్వెస్ట్​ మెసేజ్ పెట్టాలి. మీ రిక్వెస్ట్​ను వాళ్లు సమ్మతించి, తమ కాంటాక్ట్​ లిస్ట్​లో మీ ఫోన్​ నంబర్​ సేవ్​ చేస్తే.. అప్పుడు మీరు వారి ఫోన్​ నంబర్​ను చూడడానికి వీలవుతుంది.

క్యూఆర్​ కోడ్ స్కాన్​ చేయకుండానే లాగిన్​
WhatsApp web login with phone number : వాట్సాప్​ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయకుండానే.. మీ ఫోన్ నంబర్​ ద్వారా వాట్సాప్​ వెబ్​లో లాగిన్​ అయ్యేలా అప్​డేట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్​లో అందుబాటులో ఉంది. త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఇప్పటి వరకు యూజర్లు వాట్సాప్​ వెబ్​లో లాగిన్ అవ్వాలంటే కచ్చితంగా క్యూఆర్​ కోడ్ స్కాన్ చేయాల్సి వచ్చేంది. ఒక వేళ మీ ఫోన్​ కెమెరా సరిగ్గా పనిచేయకపోతే.. లాగిన్​ కావడం సాధ్యమయ్యేది కాదు. అందుకే ఈ లేటెస్ట్ అప్​డేట్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఫీచర్​ ఎనేబుల్ చేసుకునేందుకు, వాట్సాప్​ లింక్​ డివైజ్​ సెక్షన్​లో 'లింక్ విత్​ ఫోన్ నంబర్'​ అనే ఆప్షన్​లోకి వెళ్లాలి. తరువాత ఆ ఆప్షన్​ను క్లిక్​ చేసి, మీ ఫోన్ నంబర్​ను ఎంటర్​ చేయాలి. వెంటనే డెస్క్​టాప్​లో వాట్సాప్​ ఓపెన్​ చేయాలని సూచన వస్తుంది. దానిని ఓపెన్ చేసిన తరువాత, ఫోన్​ స్క్రీన్​పై కనిపిస్తున్న 8 అంకెల కోడ్​ను నమోదు చేయాలి. అంతే! ఈ విధంగా చాలా సులువుగా వాట్సాప్​ వెబ్​లో లాగిన్ కావచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.