ETV Bharat / science-and-technology

WhatsApp New Feature : వాట్సాప్​లో నయా స్టిక్కర్స్​, అవతార్స్​​.. కేవలం ఆ యూజర్స్​కు మాత్రమే!

author img

By

Published : Jul 10, 2023, 12:27 PM IST

WhatsApp new features
WhatsApp starts rolling out a redesigned sticker and GIF picker

WhatsApp New Update : వాట్సాప్​ యూజర్లకు గుడ్​ న్యూస్​. మెటా కంపెనీ తమ మెసేజింగ్​ యాప్​ వినియోగదారుల కోసం మరో లేటెస్ట్​ అప్​డేట్​ తీసుకొచ్చింది. దీనితో వాట్సాప్​లో మరింత సులువుగా, ఆకర్షణీయంగా మెసేజ్​లు పంపించేందుకు వీలుగా.. స్టిక్కర్​​, అవతార్​, జిఫ్​ పిక్​లను రీడిజైన్​ చేస్తోంది. పూర్తి వివరాలు మీరే చూడండి.

WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ తన యూజర్ల కోసం మరో సరికొత్త అప్​డేట్​ తీసుకొచ్చింది. వాట్సాప్​ సందేశాలను మరింత ఆకర్షణీయంగా పంపించేందుకుగాను.. స్టిక్కర్స్​, అవతార్స్​, జిఫ్​ పిక్​లను పునఃరూపకల్పన (రీడిజైన్​) చేస్తోంది.

WhatsApp Beta Update iOS : వాబీటాఇన్ఫో ప్రకారం, వాట్సాప్​ తీసుకువస్తున్న ఈ ఫీచర్​తో యూజర్లు కీబోర్డ్​ ద్వారా న్యూ స్టిక్కర్స్​, జిఫ్​ ఫైల్స్​ను యాక్సెస్​ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అప్​డేట్ కేవలం ఐఓఎస్​ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందుకోసం యాపిల్​ స్టోర్​లోకి వెళ్లి, ఐఓఎస్​ 23.13.78 వెర్షన్ వాట్సాప్​ను అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ అప్​డేట్​లో కొత్తదనం ఏంటి?
WhatsApp New Update : ఈ కొత్త అప్​డేట్​ వల్ల వాట్సాప్ యూజర్లు అన్​లిమిటెడ్​ స్టిక్కర్స్, జిఫ్​ ఫైల్స్​ను వినియోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ న్యూ అప్​డేట్​లో జిఫ్​, స్టిక్కర్​, అవతార్​ సెక్షన్​లను రీలొకేట్​ చేయడం జరిగింది. అలాగే ట్యాబ్స్​ విషయంలోనూ మార్పులు చేశారు. దీని వల్ల యూజర్లు మరింత సులువుగా నావిగేట్ చేయగలుగుతారు. అవతార్​ కేటగిరీని కూడా బాగా ఇంప్రూవ్​ చేశారు. దీని వల్ల చాలా పెద్ద సంఖ్యలో అవతార్​ స్టిక్కర్లు, పిక్చర్లను యూజర్లు వినియోగించుకోవచ్చు.

వాట్సాప్ వెబ్​ అప్​డేట్స్​
Web WhatsApp update : త్వరలో వాట్సాప్​ వెబ్​లో.. ఫోన్​ నంబర్​ ద్వారా వాట్సాప్ ఖాతాలు అన్నీ అనుసంధానం చేసుకునే విధంగా అప్​డేట్ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది బీటా టెస్టర్లు దీనిని వాడుతున్నారు. ప్రధానంగా ఆండ్రాయిడ్​ 2.23.14.18 వెర్షన్​లో ఈ వాట్సాప్​ ఫీజర్​ అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్​ నయా ఫీచర్స్​
Latest WhatsApp Features 2023 : వాట్సాప్​ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం నయా ఫీచర్లు తెస్తూనే ఉంది. వాట్సాప్​లో హెచ్​డీ క్వాలీటీ ఫొటోలు, వీడియోలు పంపించే విధంగా సరికొత్త ఫీచర్లు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అదే విధంగా వాట్సాప్​లోనే ఫోటో ఎడిటింగ్ ఫీచర్​, చాట్​ డిలీట్​, చాట్ ఎడిట్​ ఫీచర్లు తీసుకురానుంది.

వాట్సాప్​ స్కామ్స్​ పెరిగిపోతున్నాయ్​.. జాగ్రత్త!
WhatsApp Scams 2023 : నేటి యువత దైనందిన జీవితంలో వాట్సాప్ ఒక భాగమైపోయింది. కానీ ఇదే సమయంలో దీనిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్కామ్​ మెసేజ్​లు, వీడియోలు పంపిస్తూ, యూజర్ల డేటాను చోరీ చేస్తున్నారు. అలాగే లాటరీ వచ్చిందని, బహుమతులు వచ్చాయని నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. క్యూఆర్ కోడ్​​, క్రిప్టో స్కామ్​లకు కూడా తెగబడుతున్నారు. కనుక వాట్సాప్​ వినియోగదారులు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.