ETV Bharat / science-and-technology

నింగిలోకి దూసుకెళ్లిన స్పేస్​ఎక్స్ బాహుబలి రాకెట్- కానీ, ఎనిమిది నిమిషాలకే!

author img

By PTI

Published : Nov 18, 2023, 7:18 PM IST

Updated : Nov 18, 2023, 9:19 PM IST

Spacex Starship-2 Rocket Launch Failure
Spacex Starship-2 Rocket Launch Failure

Spacex Starship Rocket Launch : అపర కుబేరుడు ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్ ప్రయోగించిన 'స్టార్‌షిప్‌​' బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే, ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లో రాకెట్​లో ఏర్పడిన పేలుళ్ల కారణంగా స్టార్‌షిప్‌ ప్రయోగం రెండోసారి కూడా విఫలమైంది.

Spacex Starship Rocket Launch : అపర కుబేరుడు ఎలాన్ మస్క్​కు చెందిన 'స్పేస్​ఎక్స్' నిర్మించి ప్రయోగించిన బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే, ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లోనే రాకెట్​ సిగ్నల్స్​ కోల్పోవడం వల్ల లోపల జంట పేలుళ్లు సంభవించాయని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీంతో రెండోసారి కూడా స్టార్​షిప్​ ప్రయోగం విఫలమైనట్లయింది. ఇక స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం (నవంబరు 18) ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 400 అడుగుల(121 మీటర్లు) ఎత్తులో నిర్మించిన ఈ 'స్టార్​షిప్​-2' రాకెట్​ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన లాంఛ్​ వెహికిల్​.

"బూస్టర్​ స్టార్​షిప్​ను విజయవంతంగా నింగిలోకి పంపించాం. అయితే కొద్ది నిమిషాల్లోనే రాకెట్​ ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. కమ్యూనికేషన్​ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అప్పటివరకు సాఫీగా దూసుకుపోతున్న రాకెట్​ ఒక్కసారిగా కూలిపోయింది."
-స్పెస్​ఎక్స్​ సైంటిస్టులు

విజయవంతమైతే ఇలా సాగేది..
దాదాపు గంటన్నర పాటు సాగే ఈ టెస్ట్‌ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభంలో విడిపోయే బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా చర్యలు తీసుకున్నారు. స్పేస్‌క్రాఫ్ట్‌ మాత్రం భూమి చుట్టు ఒక పరిభ్రమణం సాగించి, పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయేలా రూపొందించారు. రెండు సెక్షన్ల (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌) కలిగిన ఈ స్టార్‌షిప్‌ రాకెట్‌ను చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా 'స్పేస్‌ఎక్స్​' రూపొందించింది.

మొదటి ప్రయోగం కూడా ఫ్లాప్​!
Spacex Starship First Test Flight : ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్‌షిప్‌ మొదటి టెస్ట్‌ఫ్లైట్‌ విఫలమైంది. గాల్లోకి ఎగిరిన కేవలం 4 నిమిషాల్లోనే గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఈ రాకెట్​ కుప్పకూలింది. దీంతో తొలి ప్రయోగం వైఫల్యంలో ఎదురైన అంశాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత తాజాగా ప్రయోగించిన రెండో రాకెట్‌, దాని ల్యాంచ్‌ ప్యాడ్‌లను మరింత అభివృద్ధి చేసింది స్పేస్​ఎక్స్​. అమెరికా గగనతల నిర్వహణ సంస్థ (FAA) సూచనల ఆధారంగా స్టార్‌షిప్‌-2లో 57 కీలక మార్పులను చేశారు సైంటిస్టులు. దాదాపు ఏడు నెలల తర్వాత ఎఫ్‌ఏఏ అనుమతి అనంతరం రెండోసారి ఈ ప్రయోగాన్ని శనివారం చేపట్టింది స్పేస్​ ఎక్స్. కాగా, దీని ఎత్తు 397 అడుగులుగా ఉంది.

విద్యార్థులకు ఉపయోగపడే టాప్​-12 ల్యాప్​టాప్స్ ఇవే!

'దక్షిణ గాజా నుంచి పారిపోండి'- పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు

Last Updated :Nov 18, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.