ETV Bharat / priya

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 9:43 AM IST

Updated : Sep 10, 2023, 10:24 AM IST

Gongura Mutton
How to Prepare Gongura Mutton Curr

How to Make Gongura Mutton Curry Recipe : రెగ్యులర్​గా ఒకే ఫార్మాట్​లో మటన్ కర్రీ ఎన్నిసార్లు వండుతారు చెప్పండి..? సమ్​థింగ్​ స్పెషల్​ అన్నట్టుగా.. ఈ సండే కాస్త వెరైటీగా ప్లాన్ చేయండి. ఆ రెసిపీనే.. గోంగూర మటన్. సరిగ్గా కుక్​ చేయాలేగానీ.. "ఆహా ఏమి రుచి" అని పాడుకోవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం..? ప్రిపరేషన్ మొదలు పెట్టేయండి.

How to Cook Gongura Mutton Curry : గోంగూర పేరు చెబితే చాలు.. మౌత్ వాటరింగ్ అవ్వని తెలుగువాళ్లు ఉండరంటే.. నమ్మాల్సిందే సుమీ! దాంతో పచ్చడి నూరినా.. పప్పులో వేసినా.. అదుర్స్ అనాల్సిందే. అయితే.. ఈ గోంగూరను నాన్​వెజ్​తో మిక్స్ చేసి కుక్ చేశారంటే.. ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం! ఇక.. గోంగూరను మటన్​తో కలిపేశారంటే మాత్రం.. "నభూతో.." అనాల్సిందే. ఈ అద్భుతమైన టేస్ట్​ను ఈ సండే ఇంటిల్లిపాది ఆస్వాదించండి. ఇక, ఆలస్యం చేయకుండా.. ఈ సండే.. 'గోంగూర మటన్(Gongura Mutton)'​ తో లంచ్ చేయండి.

Required Ingredients for making Gongura Mutton :

గోంగూర మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • మటన్‌-అరకేజీ
  • గోంగూర- మూడు కట్టలు
  • సన్నగా కోసిన ఉల్లిపాయలు- అర కప్పు
  • చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు- 7-8
  • అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు
  • కారం- 2 టీస్పూన్లు
  • ఆయిల్ - 3 టీస్పూన్లు
  • పసుపు- పావు టీస్పూన్‌
  • ధనియాల పొడి- టీస్పూన్‌
  • గరం మసాలా- టీస్పూన్‌
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు- రుచికి సరిపడా

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

గోంగూర మటన్​ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Gongura Mutton Making Process in Telugu : ముందుగా మటన్​ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద కాసేపు గోంగూరను ఉడికించి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత దానిని మిక్సీ పట్టాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్‌ పెట్టి నూనె వేడిచేయాలి. అప్పుడు నూనె కాస్త వేడి అయ్యాక.. సిద్ధంగా ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసి గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత అల్లంవెల్లులి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆ మిశ్రమాన్ని వేయించాలి.

అలా వేగాక.. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్‌ వేయాలి. ఆ తర్వాత మటన్​(Mutton) కాసేపటికి కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, గరం మసాలా పొడి వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ తర్వాత కుక్కర్​ మూతపెట్టి తక్కువ మంట మీద కాసేపు దానిని మగ్గించాలి. అనంతరం ఆ మిశ్రమంలో నీళ్లు పోసుకుని మూడు, నాలుగు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత మీరు ముందుగా పేస్టు చేసి సిద్ధంగా పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలిపి దానిని కాసేపు ఉడికించాలి. ఇక చివరగా కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.

అంతే నోరూరించే గోంగూర మటన్ కర్రీ రెడీ. ఇక ఈ టెస్టీ గోంగూర్ మటన్​ కర్రీని తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే గోంగూర కలిపి చేసిన మటన్​ కర్రీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోంగూర(Gongura)లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంటే.. ఇటు టేస్ట్​తోపాటు అటు ఆరోగ్యం అన్నమాట! మరి.. ఇంకేం..? ఈ ఆదివారం గోంగూర మటన్ తో ఎంజాయ్ చేయండి..!

chicken 555 biryani: నోరూరించే చికెన్ 555 చేసేద్దామా?

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

How to Prepare Mutton Curry : సండే పండగ.. అద్దిరిపోయే మటన్ కర్రీ.. ఇలా చేయండి!

Last Updated :Sep 10, 2023, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.