ETV Bharat / jagte-raho

రెండు ఆలయాల్లో చోరీ.. అరకిలో వెండి ఎత్తుకెళ్లిన దుండగులు

author img

By

Published : Sep 5, 2020, 10:04 PM IST

రెండు ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనాలకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ బోరబండ సైట్​2లోని అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో జరిగింది. ఆలయంలోని అరకిలోకుపైగా వెండి, 5 తులాల బంగారాన్ని దొంగలు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు.

theives took away half kilo gold at temple in borabanda
రెండు ఆలయాల్లో చోరీ.. అరకిలో వెండి ఎత్తుకెళ్లిన దుండగులు

హైదరాబాద్​ బోరబండలోని రెండు ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు. బోరబండ సైట్​2లోని అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు అదే ఆవరణలో ఉన్న మరో ఆలయంలో ఈ చోరీ జరిగింది. ఉదయం ఆలయంలో చోరీ జరిగిందని తెలుసుకున్న ఆలయ అధికారులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

విషయం తెలుసుకున్న ఎస్సార్​ నగర్​ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు అరకిలోకుపైగా వెండి, 5 తులాల బంగారాన్ని దోచుకున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కేంద్ర పథకాల అమలు తీరుపై కిషన్​ రెడ్డి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.